Home

»

Latest News

ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు: కానీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్యో!  

Nov 19, 2026 9:52AM

 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ రోజు ENE 2 ఉరఫ్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 తో సందడి చేస్తున్నాడు. నిన్న నైట్ ప్రీమియర్స్ నుంచే  పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం విశ్వక్ సేన్ కి కొంచం ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ప్లాప్స్ ని ప్రాణ స్నేహితులుగా మార్చుకొని తిరుగుతున్నాడు. అందులో ఒక మూవీ కల్ట్.


ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అక్టోబర్ 30 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, 20 రోజుల్లోపే అంటే కేవలం 20 రోజుల వ్యవధిలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.  ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా వదిలేసారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రావడం పాన్-ఇండియా సినీ అభిమానులకు, థ్రిల్లర్ ప్రేమికులకు పెద్ద సర్‌ప్రైజ్ అనే చెప్పాలి. థియేటర్లలో  మిస్ అయిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయవచ్చు.   


భారతీయ సినీ చరిత్రలోనే తొలి స్లాషర్ చిత్రంగా ప్రచారమైన ఈ సినిమా కథాంశం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. గోవా హోంమంత్రి కుమారుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బడా ప్రముఖులను ఆహ్వానించి ఒక గ్రాండ్ పార్టీ నిర్వహిస్తాడు. ఆనందంగా, వేడుకలా మొదలైన ఆ పార్టీ అనూహ్యంగా ఒక ప్రాణాంతక ఆటగా, వరుస హత్యల పరంపరగా మారుతుంది. పార్టీ జరిగే వేదిక చుట్టూ పేలుడు పదార్థాలు అమర్చడంతో పోలీసులు కూడా లోపలికి వెళ్లి అతిథులను కాపాడలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. సరిగ్గా అప్పుడే ఆ పార్టీలో ఉన్న డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రలో విశ్వక్ సేన్ రంగంలోకి దిగి అతిథులను ఎలా కాపాడాడు, ఈ మారణహోమం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అనేదే ప్రధాన కథ.

 

విశ్వక్ సేన్ నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన స్వాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాలు, చివరి 30 నిమిషాల కథనం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని విమర్శకులు, ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. 2 గంటల 43 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (UA) సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాకు 123తెలుగు వంటి పోర్టల్స్ 2.75/5 రేటింగ్ ఇవ్వగా, ప్రేక్షకుల నుంచి 3.35/5 రేటింగ్ లభించింది. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, వివేక్ చేపురి, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సందీప్ కాకరాల నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ సినిమా మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేశాయి. యాక్షన్, హారర్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ల్ట్' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండటంతో, వయలెంట్ సర్వైవల్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇది మంచి ఓటీటీ ఆప్షన్‌గా నిలుస్తోంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com