Home

»

Latest News

ఆగస్టు 1న ముహూర్తం.. అనుపమ, తరుణ్ భాస్కర్ 'క్రేజీ కళ్యాణం'.!

Jul 31, 2026 10:15AM

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కళ్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. 

తాజాగా మేకర్స్ "క్రేజీ కళ్యాణం" సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఆగస్టు 1న ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 

పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో  ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో "క్రేజీ కళ్యాణం" సినిమా చిత్రీకరణ జరిపారు. 

సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 1న రిలీజ్ కాబోతున్న టీజర్.. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచబోతోందని మూవీ టీమ్ నమ్మకంగా ఉంది.

 

 

Crazy Kalyanam Teaser, Anupama Parameswaran, Tharun Bhascker

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com