Home

»

Latest News

Prabhas: ప్రభాస్ అభిమానులకు సప్తగిరి బహిరంగ క్షమాపణ!

May 15, 2026

టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి (Saptagiri) గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రభాస్ 'రాజా సాబ్' (Raja Saab) గురించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడమే కాకుండా, పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సప్తగిరి, ఈ వివాదంపై స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు కోరారు.

సప్తగిరి అసలు ఏం మాట్లాడారంటే.. ఒక సందర్భంలో తన చేతిలో ఉన్న సినిమాల గురించి చెబుతూ, తను చేస్తున్న చిన్న బడ్జెట్ సినిమాల లిస్టులో పొరపాటున 'రాజా సాబ్' పేరును కూడా చేర్చారు. పాన్ ఇండియా లెవల్లో వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రభాస్ సినిమాను 'చిన్న సినిమా' అనడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

ఈ విషయంపై సప్తగిరి క్లారిటీ ఇస్తూ, "నేను కొన్ని మినిమం బడ్జెట్ సినిమాలు చేస్తున్నాను, వాటిలో నాకు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయని చెబుతూ.. ఫ్లోలో రాజా సాబ్‌ను కూడా ఆ లిస్టులో చేర్చాను. అది నిజంగా పొరపాటే, అందుకు రియల్లీ సారీ. మారుతి గారు కూడా నాకు ఫోన్ చేశారు, ఆయనకు కూడా నేను క్షమాపణలు చెప్పాను" అని వివరించారు.

తాను ప్రభాస్ సినిమాను చిన్న సినిమా అని ఉద్దేశపూర్వకంగా అనలేదని, కేవలం మాటల మధ్యలో దొర్లిన తప్పు మాత్రమేనని సప్తగిరి స్పష్టం చేశారు. మారుతి గారు ఫోన్ చేయగానే వెంటనే రియలైజ్ అయ్యానని, మీడియా ముఖంగా మరోసారి క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు.

'రాజా సాబ్'ను చిన్న సినిమా అనడంతో సోషల్ మీడియాలో సప్తగిరిపై ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com