Home

»

Latest News

Comedian Ali: 'యాంటీ హిందూ' యాడ్ వివాదం.. కమెడియన్ అలీపై నెటిజన్లు ఫైర్!

May 12, 2026

- వివాదంలో కమెడియన్ అలీ
- హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నెటిజన్లు ఫైర్!
- అలీ క్షమాపణలు చెబుతారా? చిక్కుల్లో పడతారా?

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ (Comedian Ali) ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన 'ఘర్ సోప్' బ్రాండ్ కు సంబంధించిన యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ యాడ్ హిందూ ధర్మాన్ని, ముఖ్యంగా లక్ష్మి దేవిని కించపరిచే విధంగా ఉందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతంలోనే అనేక వివాదాల్లో నిలిచిన అలీ, ఇప్పుడు ఈ 'యాంటీ హిందూ' యాడ్ అంశంతో మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.

'ఘర్ సోప్' యాడ్ లో లక్ష్మి దేవికి పూజ చేసినట్టుగా.. 'సోప్'కి పూజ చేస్తూ అలీ కనిపించారు. అంతేకాకుండా, లక్ష్మిదేవి నామాలను కూడా ఈ యాడ్ లో ఉపయోగించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. 

అలీ లాంటి సీనియర్ నటుడు ఇలాంటి యాడ్ ను చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, స్క్రిప్ట్ చేంజ్ చేస్తేనే యాడ్ చేస్తానని అలీ చెప్పి ఉండాల్సిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కళాకారులు ఏ పాత్ర చేసినా, ఏ ప్రకటనలో నటించినా.. సమాజంలోని వివిధ వర్గాల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో, అలీ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు ఈ 'ఘర్ సోప్' ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలనే పిలుపులు కూడా వినిపిస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com