Home

»

Latest News

Comedian Ali: 'యాంటీ హిందూ' యాడ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కమెడియన్ అలీ!

May 13, 2026

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ (Comedian Ali) ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన 'ఘర్ సోప్' బ్రాండ్ కు సంబంధించిన యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ యాడ్ హిందూ ధర్మాన్ని, ముఖ్యంగా లక్ష్మి దేవిని కించపరిచే విధంగా ఉందంటూ అలీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా దీనిపై స్పందించిన అలీ, క్షమాపణలు చెప్పారు.

ఆ యాడ్ లో లక్ష్మి దేవికి పూజ చేసినట్టుగా 'సోప్'కి పూజ చేస్తూ అలీ కనిపించారు. అంతేకాకుండా, లక్ష్మిదేవి నామాలను (దేవుడు చేసిన మనుషులు సినిమాలోని సాంగ్ బిట్) కూడా ఈ యాడ్ లో ఉపయోగించారు. ఇదే వివాదానికి కారణమైంది. 

అలీ లాంటి సీనియర్ నటుడు ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి యాడ్ ను చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నెటిజెన్లు ఆయన తీరును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. 

వివాదం ముదురుతుండటంతో అలీ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన కోరారు.

"ఘర్ సోప్ యాడ్ లో దేవుడు చేసిన మనుషులు సినిమాలోని నేను చేసిన బిట్ ను ఉపయోగించాం. ముంబై కంపెనీ వాళ్ళు అది చేయమన్నారు. అయితే చాలామంది అది బాలేదు సార్, ఇబ్బందిగా ఉంది, డిలీట్ చేయండి అని చెప్పారు. నేను కూడా కంపెనీ వాళ్లకు చెప్పాను.. డిలీట్ చేశారు. దీని వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని అలీ అన్నారు.

అలీ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com