విక్రమ్ 'కోబ్రా' రిలీజ్ డేట్ వచ్చింది
on May 20, 2022
చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు రూపొందిస్తున్న సినిమా 'కోబ్రా'. 'డిమాంటి కాలనీ', 'ఇమైక్కా నోడిగళ్(అంజలి ఐపీఎస్)' సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన జ్ఞానముత్తు హ్యాట్రిక్ సినిమా కావడంతో 'కోబ్రా'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇండియాలోని గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు 'కోబ్రా'తో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న 'కోబ్రా'ని ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించాడు. అదే తేదీకి తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.
Also Read