
సినీ, కళా మాధ్యమం అనేది పంచభూతాల కంటే పవర్ ఫుల్ అంటూ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా సింగిల్ టైంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించాడు ఇళయ దళపతి విజయ్. మరి తనకి అంతటి శక్తీని ఇచ్చిన సినిమాకి సాయం చేయడంలో ఏమైనా వెనుకంజ వేస్తాడా చెప్పండి. సినిమాకి సరికొత్త శక్తిని ఇచ్చాడు.
తమిళ చిత్ర పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించేందుకు, అలాగే అభిమానులకి సినిమా చూసే అనుభూతిని మరింత చేరువ చేసేందుకు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శన సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ప్రకారం ఇకపై రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఏకంగా 6 షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. అంతేకాకుండా, అభిమానుల కోసం ఉదయం పూట ఉత్సాహాన్ని నింపేలా ప్రత్యేకంగా 6 AM ఎర్లీ మార్నింగ్ స్క్రీనింగ్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ వర్గాలు, స్టార్ హీరోల అభిమానులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, థియేటర్ యాజమానుల సంఘాలు, నిర్మాతలు గత కొంతకాలంగా కోరుతున్న మరో ప్రధాన డిమాండ్‌పై మాత్రం ప్రభుత్వం భిన్నమైన వైఖరిని ప్రదర్శించింది. విపరీతంగా పెరిగిపోయిన నిర్మాణ వ్యయం, నిర్వహణ భారాలను దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలను పెంచాలని థియేటర్ యజమానులు గట్టిగా కోరారు. కానీ, సామాన్య ప్రేక్షకులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విజయ్ ఈ టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. రోజువారీ షోల సంఖ్యను 6కి పెంచడం ద్వారా నిర్మాతలు, థియేటర్ల యజమానులు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుందని, అదే సమయంలో సామాన్య ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఈ సమతుల్య నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అది కూడా సినిమా మంచి కోసమే.
ఇది కూడా చదవండి: డ్రాగన్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్: ఫ్యాన్స్ లో హుషారు!

ఈ తాజా నిబంధనల అమలుతో కోలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల సమయాల్లో నెలకొనే ఇబ్బందులు తొలగిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణ రోజుల్లోనూ, పండుగ సీజన్లలోనూ 6 షోల ప్రదర్శన వల్ల కలెక్షన్ల జోరు మరింత పెరుగుతుందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 AM షోల వల్ల మొదటి రోజు కలెక్షన్ల రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టికెట్ ధరలు పెరగకపోవడం వల్ల కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి సంకోచం లేకుండా థియేటర్లకు వచ్చేందుకు వెసులుబాటు దొరికింది. మొత్తానికి కోలీవుడ్ ఇండస్ట్రీ మనుగడను కాపాడుతూనే, ప్రేక్షకుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
[Cm Vijay Approves Six Shows Per Day, CM Vijay, Tamil Nadu cinema news, 6 shows per day, Kollywood movie updates, 6 AM screenings, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]






