Home

»

Latest News

Ntr: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై అధికారకంగా లేఖ రిలీజ్ 

Jul 13, 2026 3:47PM

 

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)రాజకీయ ఆరంగేట్రంపై కొన్ని రోజులుగా  సోషల్ మీడియా మరియు ప్రధాన మీడియా వేదికల్లో ఒకటే ఉత్కంఠ నడుస్తోంది. ముఖ్యంగా జులై 18వ తేదీన ఎన్టీఆర్  పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఆ రోజు ఒక భారీ బహిరంగ సభని  నిర్వహించి తన భవిష్యత్తు ప్రణాళికని ప్రకటించబోతున్నాడనే ఊహాగానాలు సినీ, రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఇళయ దళపతి విజయ్  రాజకీయాల్లోకి ప్రవేశించి  అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం, ఏపీలో పవన్ కళ్యాణ్ సాధించిన తిరుగులేని సక్సెస్ నేపథ్యంలో, అదే తరహాలో తారక్ కూడా రంగంలోకి దిగుతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, ఈ సంచలన ప్రచారానికి తాజాగా ఎన్టీఆర్ అధికారిక టీమ్, ఎన్టీఆర్ అభిమానుల సంఘం సంయుక్తంగా ఒక లేఖ విడుదల చేస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ లేఖతో అభిమానుల్లోనూ, పొలిటికల్ సర్కిల్స్‌లోనూ నెలకొన్న సస్పెన్స్‌కి  ఎట్టకేలకు తెరపడింది.

అభిమానుల సంఘం విడుదల చేసిన అధికారిక లేఖ ప్రకారం.. జులై 18న నిర్వహించ తలపెట్టిన "ఊరు-వాడ" కార్యక్రమానికి, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం పూర్తిగా ఒక సామాజిక సేవా కార్యక్రమంతో పాటు  అభిమాన సంఘాల పునర్వ్యవస్థీకరణకి  సంబంధించినది. ఎన్టీఆర్ వెండితెరపై సాధిస్తున్న 100 శాతం విజయాల స్పూర్తితో సమాజంలో మార్పు తీసుకురావడానికి, సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడానికి ఎప్పుడో నెలల క్రితమే ఈ "ఊరు-వాడ" ప్రణాళికని  సిద్ధం చేసినట్లు వివరించారు. కేవలం ఈ మీటింగ్‌ని  కొందరు రాజకీయ రంగు పులిమి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న "డ్రాగన్" వంటి ప్రతిష్టాత్మక పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన దృష్టి మొత్తం 100 శాతం సినిమాలపైనే ఉంది.

Also read: sir sam neill: జురాసిక్ పార్క్ సామ్ ఇక లేరు.. ఈ రోజు ఉదయం కన్నుమూత 


ఈ నేపథ్యంలో మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు మరియు డిజిటల్ సోషల్ మీడియా పేజీలు ఎలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని, అసత్య పుకార్లను ప్రచారం చేయవద్దని ఎన్టీఆర్ టీమ్ గట్టిగా విజ్ఞప్తి చేసింది. "ఊరు-వాడ" కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం, మరియు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన పూర్తి రోడ్‌మ్యాప్ వివరాలను త్వరలోనే ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా స్వయంగా వెల్లడిస్తారు. కాబట్టి అభిమానులు ఎవరూ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలో అవ్వాలని సూచించారు. 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com