Home

»

Latest News

కెమెరామెన్ విన్సెంట్ క‌న్నుమూత‌

Feb 25, 2015 12:26PM

సీనియ‌ర్  ఛాయాగ్ర‌హ‌కుడు ఎ.విన్సెంట్ (83) క‌న్నుమూశారు. కొద్ది సేప‌టిక్రితం ఆయ‌న‌ చెన్నైలో  గుండెపోటుతో మ‌ర‌ణించారు. ప‌లు తెలుగు, త‌మిళ‌ హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు ప‌నిచేశారాయ‌న‌. త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అటు చాయాగ్ర‌హ‌కుడిగా, ఇటు ద‌ర్శ‌కుడిగా రెండు పాత్ర‌లు పోషించారుజ  తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లు చిత్రాల‌కు ఆయ‌న కెమెరామెన్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆప‌ద్భాంధ‌వుడు, బాబు, దేవ‌త‌,  మేజ‌ర్ చంద్ర‌కాంత్‌, అల్ల‌రిప్రియుడు, ఘ‌రానా మొగుడు,  అన్న‌మ‌య్య‌... ఇలా ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు ప‌నిచేశారాయ‌న‌.  1985 లోనే ఓ మ‌ల‌యాళ చిత్రం ద్వారా త్రీడీ ఎఫైక్ట్స్‌ని ప‌రిచ‌యం చేశారాయ‌న‌. ద‌ర్శ‌కుడి భావాల‌ను అనుగుణంగా క‌థ‌ని తెర‌పై క‌ళాత్మ‌కంగా తెర‌కెక్కించ‌డంలో విన్సెంట్ ప్ర‌సిద్ధుడు. ఆయ‌న మ‌ర‌ణం.. యావ‌త్ చిత్ర‌సీమ‌కూ తీర‌ని లోటు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com