Home

»

Latest News

christopher Nolan: ఆ భారతీయ దర్శకుడి నుంచి ఎంతో నేర్చుకున్నా.. క్రిస్టోఫర్ నోలన్ మాటలు వైరల్ 

Jul 28, 2026 4:47PM

 

ప్రెజెంట్ దర్శకుడు 'క్రిస్టోఫర్ నోలన్'(Christopher Nolan)తన కలల సౌధం  'ది ఒడిస్సీ'(The Odissey)తో రికార్డుల మీద రికార్డులు కొడుతూ భారీ కలెక్షన్స్ రాబడుతున్నాడు. మన దేశంలో  కూడా అదిరిపోయే కలెక్షన్స్ తో సంచలనం దిశగా దూసుకెళ్తుంది. నోలన్‌కి మన దేశంతో ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2011లో 'ది డార్క్ నైట్ రైజెస్' కోసం జోధ్‌పూర్‌లోని మెహ్రాన్‌గఢ్ కోటలో షూటింగ్ చేయడం, 2019లో 'టెనెట్' సినిమా కోసం ముంబైలో 10 రోజుల పాటు చిత్రీకరణ జరపడం, మరియు ఇటీవల 'ది ఒడిస్సీ' ప్రమోషన్ల కోసం రావడం ద్వారా భారత్ తనపై చూపించే అభిమానాన్ని పలుమార్లు ప్రశంసించాడు. క్రిస్టోఫర్ రీసెంట్ గా మన భారతీయ సినిమాకి గర్వకారంగా నిలిచిన దర్శకుడు 'సత్యజిత్ రే' పై చేసిన ప్రశంసలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్నాయి.

.న్యూయార్క్‌లోని ప్రముఖ 'క్రైటీరియన్ క్లోసెట్'ను సందర్శించిన సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,000 కి పైగా అత్యుత్తమ క్లాసిక్ సినిమాల సేకరణ నుంచి ఆయన భారతీయ సినిమా రత్నమైన సత్యజిత్ రే రూపొందించిన 'ది అపు ట్రైలజీ' (The Apu Trilogy) బాక్స్ సెట్‌ను ఎంతో ఇష్టంగా ఎంచుకున్నారు. ఈ సందర్భంగా నోలన్ మాట్లాడుతూ, 1955లో విడుదలైన సత్యజిత్ రే(satyajit Ray)మాస్టర్‌పీస్ 'పథేర్ పాంచాలి' (Pather Panchali) నన్ను  పూర్తిగా అబ్బురపరిచింది. మూవీ మొత్తం  చూశాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. గ్రామీణ బెంగాల్ నేపధ్యంలో సాగే చిన్నారి అపు జీవిత ప్రయాణం, కుటుంబ బంధాలు, పేదరికం, ఆశలు మరియు మానవీయ కోణాలని  తెరకెక్కించిన తీరు నాపై చెరగని ముద్ర వేసింది. అయితే తదుపరి చిత్రాలైన 1956 , 1959  లో వచ్చిన అపరాజితో' 'అపూర్ సంసార్' (Apur Sansar) సినిమాలని  ఇప్పటివరకు చూడలేదని నోలన్ ఒప్పుకున్నారు. అందుకే ఈ మొత్తం 'అపు ట్రైలజీ' బాక్స్ సెట్‌ను ఇంటికి తీసుకెళ్లి, అపు జీవిత కథను పూర్తిగా చూసి ఆస్వాదించాలని ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ఉత్సాహంగా ప్రకటించారు.

Also Read: హ్యాండ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్.. ఫ్యాన్స్ డిజప్పాయింట్ 


ప్రసిద్ధ రచయిత బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్ నవలల ఆధారంగా సత్యజిత్ రే రూపొందించిన ఈ 'అపు ట్రైలజీ' భారతీయ సినిమా చరిత్రలోనే కాక, ప్రపంచ సినీ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచింది. ఈ మూడు చిత్రాలు కథనంలో ఉన్న ప్రామాణికత, సహజత్వం మరియు భావోద్వేగ తీవ్రతతో 3 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడమే కాకుండా కాన్స్, బెర్లిన్, వెనిస్ వంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఎన్నో ప్రసిద్ధ పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. ఆస్కార్ స్థాయి హాలీవుడ్ దర్శకుడైన నోలన్ నోటి వెంట సత్యజిత్ రే క్లాసిక్స్ గురించి ఇలాంటి అపారమైన ప్రశంసలు రావడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు "ఒక దిగ్గజం మరొక దిగ్గజాన్ని గౌరవించడం అంటే ఇదే" అని సంబరపడిపోతున్నారు. ఇక భారతీయ సినిమా తన మనుగడ కొనసాగిస్తున్నంత కాలం సత్య జిత్ రే పేరు  మార్మోగిపోతూ ఉంటుంది. ఎంతో మంది దర్శకులకి సత్య జిత్ రే నుంచి వచ్చిన  కథ, కథనం, క్యారెక్టర్స్ ని ఉపయోగించుకునే తీరు ఇన్ స్పిరేషన్.

christopher Nolan, Satyajit Ray, Pather Panchali

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com