
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా 'చోర్ బజార్'. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'చోర్ బజార్' సినిమా టైటిల్ సాంగ్ ను శుక్రవారం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని విడుదల చేశారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. "చోర్ బజార్ టైటిల్ సాంగ్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా ట్రెండీగా ఉంది. గల్లీ బాయ్స్ పాటలా అనిపించింది. ఆకాష్ క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్ అదిరిపోయినట్లు పాటతో తెలుస్తోంది. రెగ్యులర్ పాటలా కాకుండా ర్యాప్ తో టుడేస్ సాంగ్ లా చేశారు. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఆకాష్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా. ఆల్ ది బెస్ట్." అన్నారు.
చోర్ బజార్ టైటిల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే.. "మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె.. దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె.. ఇది చోర్ బజార్... ఆజా చోర్ బజార్.. ప్రతి బస్తీలో ఉంట నేను, లేదు నాకు ఆధార్.. నచ్చినట్లు బతుకుతుంట, లేదు నాకు బాధ...ఖద్దరైన, ఖాకీ అయిన లేదు నాకు తేడా, రంగు రంగు జీవితాలు చోర్ బజార్ ఆజా" అంటూ సాగుతుందీ సాంగ్. రాప్ స్టైల్ లో సాగిన ఈ పాట మంచి ఎనర్జీతో సాగుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను వివరించింది. నవాబ్ గండ్, అసురన్ టీమ్ ఈ పాటకు సంగీతాన్ని, ర్యాప్ అందించి పాడారు.






