Home

»

Latest News

'క‌త్తి' క‌థ‌ని ఖూనీ చేస్తున్నారా??

Aug 23, 2016 5:06PM

త‌న 150వ సినిమాకోసం చిరంజీవి ఎన్ని క‌థ‌లు విన్నాడో లెక్కేలేదు. ఇండ్ర‌స్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ర‌చ‌యితలంతా చిరుకి క‌థ‌లు వినిపించి వినిపించీ నీర‌స‌ప‌డిపోయారు. ఇవ‌న్నీ కాదులే.. అనుకొని ఆల్రెడీ త‌మిళంలో హిట్ట‌యిన క‌త్తి సినిమాని తెలుగులో రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, ఆ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డం, ఫ‌స్ట్ లుక్ కూడా బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగిపోయాయి. క‌త్తి క‌థ‌ని చిరు రీమేక్ చేస్తున్నాడు అన‌గానే కొన్ని సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. ఈ సినిమా చిరు ఇమేజ్‌కి, ప్ర‌స్తుతం త‌న‌కున్న రాజ‌కీయ ప‌రిణితికీ స‌రిపోతాయా అంటూ సందేహాలు లేవ‌నెత్తారు. అయితే క‌త్తి లో ఓ స్టార్ హీరో చేయాల్సినంత విష‌యం ఉంది. క‌థానాయ‌కుడి క్యారెక్ట‌ర్ కాస్త డౌన్ టు ఎర్త్ ఉంటుంది ఆ సినిమాలో. రీమేక్‌లోనూ య‌ధావిధిగా అది ఫాలో అయిపోతారేమో అనుకొన్నారు. అయితే ఇక్క‌డే క‌థ తిర‌గ‌బ‌డింది. చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుక‌ల‌లో భాగంగా వినాయ‌క్ 'ఖైదీ నెంబ‌ర్ 150'లోని ఓ డౌలాగ్ లీక్ చేశాడు. 'పొగ‌రు నా ఒంట్లో ఉంది. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది' అనేది ఆ డైలాగ్‌. దీన్ని బ‌ట్టి చూస్తుంటే.. క‌త్తి క‌థ‌ని ఖూనీ చేస్తున్నారేమో అన్న సందేహాలు మొద‌లైపోతున్నాయి. క‌త్తిలో విజ‌య్ ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ డైలాగులేం చెప్ప‌లేదు. త‌న పాత్ర ప‌రిధి అందుకు స‌హ‌క‌రించ‌దు కూడా. తెలుగులోకి వ‌చ్చేస‌రికి చిరు కి అనుగుణంగా డైలాగులు వ‌చ్చిపడిపోయాయి.

 

పైగా ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చేయి చేసుకొంటున్న సినిమా కాబ‌ట్టి.. 'మొక్కే క‌దా అని పీకీస్తే పీక కోస్తా' 'రాన‌నుకొన్నావా, రాలేన‌నుకొన్నావా' అంటూ ఇంద్ర టైపు డైలాగులు గుప్పించేయ‌డానికి రెడీ అయిపోయిన‌ట్టున్నారు.  ఇలాంటి పంచ్ డైలాగులు ప‌డాలంటే.. క్యరెక్ట‌రైజేష‌న్ మార్చాలి.. అలా జ‌ర‌గాలంటే క‌థ మార్చాలి. చిరు ఇమేజ్ కోసం ఇలా క‌త్తి క‌థ‌కు కుట్లు వేసుకొంటూ పోతే.. క‌థ‌లో ఔచిత్సం దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. క‌థ‌లేక‌పోయినా ఫ‌ర్వాలేదు.. చిరు ఇమేజ్‌కి త‌గ్గ డైలాగులు ఉంటే చాలు అని వినాయ‌క్ ఫిక్స‌యితే మ‌నమేం చేయ‌లేదు. మ‌రో సాదీ సాదీ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చూడ్డానికి సిద్ఢ‌మైపోవ‌డం త‌ప్ప‌. ఇమేజ్ కోసం క‌థ‌ని బ‌లి చేస్తారో.. లేదంటే ఇలాంటి డైలాగులు త‌గ్గించుకొని క‌థ‌ని బ‌తికించే ప్ర‌య‌త్నం చేస్తారో.. ఖైదీ నెం.150 విడుద‌ల‌య్యాకే తెలుస్తుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com