
వైవిధ్యమైన కథలతో సెల్యులాయిడ్ పైకి వచ్చేమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈ రోజు హారర్ కామెడీ జానర్ 'కొరియన్ కనకరాజు' తో సరెండర్ అయ్యాడు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా 'కొరియన్ కనకరాజు' పై స్పందిస్తూ 'ఎక్కడ విన్నా నవ్వులే నవ్వులు. ప్రియమైన వరుణ్ తేజ్, ఈ విజయానికి నిజంగా నువ్వు అర్హుడివి. నీ కష్టం, నిబద్ధతకు తగిన ఫలితం దక్కింది. ఈ గొప్ప విజయాన్ని అందుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. త్వరలోనే మూవీని వీక్షించనున్నట్లుగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. దీంతో మెగా ఫ్యాన్స్ లో జోష్ నెలకొని ఉంది. కొరియన్ కనకరాజు కథాంశం ఎంతో వినూత్నంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను థియేటర్లలో పగలబడి నవ్వించేలా తీర్చిదిద్దారు. పెనుగొండలోని కియా కార్ల తయారీ పరిశ్రమలో పనిచేసే చైత్ర అనే యువతి ప్రేమలో కథానాయకుడు కనకరాజు పడతాడు. కొరియన్ సంస్కృతి, డ్రామాలంటే ఇష్టపడే కథానాయకి చుట్టూ, కొరియా ప్రాంతం నుంచి ముడిపడిన కొన్ని ఆసక్తికరమైన అనూహ్య పరిణామాలు మరియు ఆత్మల నేపథ్యంతో సాగే వినోదం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also read: బాలయ్య హీరోయిన్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. కానీ ఆ కుక్క ఏం చేసిందంటే
వరుణ్ తేజ్ తన నటనతో అలరించడమే కాకుండా సీమ యాసలో పలికే సంభాషణలతో అందరినీ మెప్పించాడు హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్ తన అందం, అభినయంతో ఆకట్టుకోగా, కమెడియన్ సత్య తనదైన టైమింగ్, వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్‌తో ప్రధాన హైలైట్‌గా నిలిచాడు. థమన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగా, కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకుడు.
Chiranjeevi, Korean Kanakaraju, varun tej





