ENGLISH | TELUGU  

ఆడియో ఫంక్షన్లో చిరంజీవి ఏం మాట్లాడతారు ?

on Mar 20, 2016

చాలా కాలం తర్వాత మెగా బ్రదర్స్ అంతా కలిసి సర్దార్ ఆడియోలో కలిసి కనిపించబోతున్నారు. చిరు స్టేజ్ పై ఏం మాట్లాడతారు ? అని మెగాఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ. పవన్ జనసేన స్థాపించిన తర్వాత, బ్రదర్స్ మధ్య దూరం పెరిగింది. తన ఇంటర్వ్యూల్లో పవన్ చిరు ప్రస్తావన తీసుకురావడం మానేశారు. చిరు కూడా పవన్ గురించిన విషయాలు మాట్లాడటం మానేశారు. చిరు బర్త్ డే కు ముందురోజు నాగబాబు ఆవేశంగా మాట్లాడితే, మెగా బ్రదర్స్ మధ్య నిజంగానే ఏదో వివాదం నడుస్తోందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాతి రోజే, చిరు బర్త్ డే ఫంక్షన్ కు పవన్ హాజరై విష్ చేసి మళ్లీ బంధాన్ని చిగురించేలా చేశారు.

ఆ తర్వాత బ్రూస్ లీ కోసం అన్నదమ్ములు మళ్లీ కలవడం, సర్దార్ సెట్స్ కు చిరు వెళ్లడం, లేటెస్ట్ గా చిరును పవన్ ఆహ్వానించడం జరిగింది. అందుకే ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో చిరు దేని మీద మాట్లాడతారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇద్దరూ రెండు వేరు వేరు పార్టీల్లో ఉండటంతో రాజకీయాల గురించి చిరు మాట్లాడే అవకాశం ఉందా..? అసలు ఒకరిపై ఒకరి ప్రేమ ఎలా ఉంటుందో, ఇద్దరూ కలిసి ఇన్నాళ్ల తర్వాత పబ్లిక్ గా ఎలా కనిపించబోతున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.