
‘ప్యారడైజ్’ రిలీజ్‌కు ముందే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ‘దసరా’తో దర్శకుడిగా పరిచయమై, మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓదెల.. తన రెండో సినిమాగా ‘ది ప్యారడైజ్’ను భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఇక ఆ తర్వాత చిరంజీవితో సినిమా అనౌన్స్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ‘ప్యారడైజ్’ విడుదల తర్వాత సినిమాకు వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ నేపథ్యంలో.. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ప్యారడైజ్ రిజల్ట్‌తో మెగాస్టార్ తన నిర్ణయం మార్చుకున్నారని, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని రకరకాల వార్తలు వచ్చాయి.
కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రచారంలో నిజం లేదట. ‘ప్యారడైజ్’ విడుదలకు కొద్దిరోజుల ముందే శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్‌ను కలిశారట. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య తమ తదుపరి ప్రాజెక్ట్ గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ‘ప్యారడైజ్’ రిజల్ట్ ఎలా ఉన్నా.. ప్రస్తుతం తాను చేస్తున్న ‘కాకా’ సినిమా పూర్తయిన వెంటనే మన సినిమా మొదలుపెడదామని చిరంజీవి చెప్పారట.

అయితే శ్రీకాంత్ ఓదెల మాత్రం వెంటనే సినిమా మొదలుపెట్టకుండా ఆరు నెలల బ్రేక్ కావాలని చిరంజీవిని కోరారట. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంతో పాటు, ఈ ఆరు నెలల్లో సినిమా స్క్రిప్ట్‌ను పూర్తిగా సిద్ధం చేసుకుని వస్తానని చెప్పారట. దానికి మెగాస్టార్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అంటే, శ్రీకాంత్ స్క్రిప్ట్ పూర్తి చేయగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అన్నమాట.
అందుకే ‘ప్యారడైజ్’ రిజల్ట్ కారణంగా చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల సినిమా ఆగిపోయిందన్న వార్తలను ప్రస్తుతానికి నమ్మాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ టాక్. పైగా మెగాస్టార్ స్వయంగా ‘కాకా’ తర్వాత మన సినిమా మొదలుపెడదామని చెప్పారన్న వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
ఇది కూడా చదవండి: నానా పటేకర్ కన్నుమూత.. దిగ్గజ నటుడి మృతికి కారణమిదే.!
[Chiranjeevi Srikanth Odela Movie Update, Chiranjeevi Next Movie, Megastar Chiranjeevi, Director Srikanth Odela, The Paradise Movie, Nani Paradise Movie, Kaaka Movie, Telugu Film News]





