Home

»

Latest News

మ‌హేశ్‌ను తీసుకోవాలా, వ‌ద్దా?: మెగాస్టార్ డైల‌మా

Mar 9, 2020 6:45PM

 

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'‌. కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ నిర్విరామంగా జ‌రుగుతోంది. ఆగ‌స్ట్‌లోనే ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి త‌గ్గ‌ట్లు సిద్ధం చేయాల‌ని చిరంజీవి ఆదేశించ‌డంతో రేయింబ‌వ‌ళ్లు ఈ సినిమాయే ధ్యాస‌గా కొర‌టాల ప‌నిచేస్తున్నాడు. ఇప్ప‌టికే ఒక భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌, చిరంజీవి- రెజీనా క‌సాండ్రా జోడీపై ఒక స్పెష‌ల్ సాంగ్ చిత్రీక‌రించారు. ఇప్పుడు అస‌లు హీరో హీరోయిన్లు చిరంజీవి, త్రిష‌పై స‌న్నివేశాలు షూట్ చేయ‌డానికి డైరెక్ట‌ర్ రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. వారంలోగా ఆమె 'ఆచార్య' సెట్స్‌పై అడుగు పెట్ట‌నున్న‌ట్లు తెలిసింది. ఆరోజు నిర్మాత‌లు ఆమె పేరును అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. 'స్టాలిన్' మూవీ త‌ర్వాత చిరంజీవి, త్రిష జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇదే.

కాగా ఈ మూవీలో ఒక కీల‌క పాత్ర‌ను చేయ‌డానికి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే ఫ్యాన్స్ నుంచి వ‌స్తున్న స్పంద‌న దృష్ట్యా చిరంజీవి, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌నీ, అందువ‌ల్ల మ‌హేశ్‌ను తీసుకొనే విష‌యాన్ని పెండింగ్‌లో ఉంచార‌నీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మ‌హేశ్ చేస్తే 'ఆచార్య' మూవీ మ‌రో స్థాయికి వెళ్తుంద‌ని చిరంజీవి అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ స్పెష‌ల్ రోల్‌ను మొద‌ట రామ్‌చ‌ర‌ణ్ చేయాల‌నుకున్నాడు. కానీ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో సినిమాలో న‌టించ‌కూడ‌ద‌ని రాజ‌మౌళి నిబంధ‌న విధించ‌డంతో చేసేదేమీ లేక ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నాడు చ‌ర‌ణ్‌. త‌న బ‌దులు అల్లు అర్జున్‌తో ఆ క్యారెక్ట‌ర్‌ను చేయించాల‌ని అత‌డు భావిస్తే, దానికి చిరంజీవి అంగీక‌రించ‌లేదు. ఆయ‌న మ‌హేశ్ వైపు మొగ్గుచూప‌డం, అందుకు అనుగుణంగా మ‌హేశ్‌ను కొర‌టాల క‌లిసి, క్యారెక్ట‌ర్ వివ‌రించ‌డం, మ‌హేశ్ అంగీక‌రించ‌డం జ‌రిగిపోయాయి. 

అయితే మ‌హేశ్ బ‌దులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఆ క్యారెక్ట‌ర్ చేయిస్తే, 'ఆచార్య' ప్రాజెక్టుకు ఇంకా ఎక్కువ క్రేజ్ వ‌స్తుంద‌ని మెగా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారంలోకి తెచ్చారు. దీంతో చిరంజీవి సంక‌ట స్థితిలో ప‌డ్డారు. ఎందుకంటే ఈ క్యారెక్ట‌ర్ గురించి మ‌హేశ్‌ను మొద‌ట ఫోన్ చేసి అడిగింది చిరంజీవే. అందుకే మ‌హేశ్ బ‌దులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తీసుకోవాలా, వ‌ద్దా అనే డైల‌మాలో ఆయ‌న ప‌డ్డారు. అయితే ఇప్ప‌టికే రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్‌.. 'ఆచార్య' కోసం కాల్షీట్లు ఇచ్చే ప‌రిస్థ‌తిలో లేర‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ ప‌రిస్థితుల్లో మ‌హేశ్ కంటే మించిన ఆప్ష‌న్ 'ఆచార్య‌'కు లేద‌ని తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com