Home

»

Latest News

నీకు హద్దులు లేవు: కమెడియన్ సత్యపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్.!

Aug 12, 2026 3:05PM

టాలీవుడ్ లో ఒక నటుడికి దక్కే అతిపెద్ద బహుమతి ఏది అంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చే ప్రశంస అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన నటులైనా, కమెడియన్లైనా వారి టాలెంట్‌ను గుర్తించి వేదికలపై ప్రోత్సహించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు.

తాజాగా 'కొరియన్ కనకరాజు' మూవీ సక్సెస్ ఈవెంట్ లో కమెడియన్ సత్యపై చిరంజీవి కురిపించిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వేదికపై మాట్లాడిన మెగాస్టార్, సత్య నటన గురించి చెబుతూ "ఈ సినిమాలో నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నీ కామెడీ టైమింగ్, నటన చూశాక నీ కోసమే ఈ సినిమాను మరోసారి చూడాలి అనిపించింది" అని కొనియాడారు.

గతంలో సత్య తనతో కలిసి నటించిన రోజులను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. సత్య నటనలో ఎలాంటి హద్దులు, పరిమితులు ఉండవని, ఆ క్యారెక్టర్‌కు ఏది కావాలో తన మిమిక్ టాలెంట్‌తో దానికి తగ్గట్టుగా మలచుకుంటూ వెళ్లిపోతాడని అభినందించారు.

"నువ్వు ఎలాంటి అభద్రతా భావాలు లేకుండా, నిర్భయంగా నటించే విధానమే నీ అసలైన బలం. నీలో ఉన్న ఆ వైవిధ్యమే నిన్ను ఇంతమంది ప్రేక్షకులకు దగ్గర చేసింది" అని మెగాస్టార్ కొనియాడారు.

ప్రేక్షకుల ఆశీస్సులతో సత్య ఖాతాలో మరిన్ని ఘన విజయాలు చేరాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.

ఇటీవలి కాలంలో కామెడీ చిత్రాలతోనూ, వైవిధ్యమైన పాత్రలతోనూ మెప్పిస్తున్న సత్యకి మెగాస్టార్ ఇచ్చిన ఈ కాంప్లిమెంట్ ఒక పెద్ద సర్టిఫికెట్‌లాంటిదని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

Chiranjeevi, Comedian Satya, Korean Kanakaraju

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com