ENGLISH | TELUGU  

పుట్టినరోజు సందర్భంగా మెగాభిమానులకు ‘చిరు’ కానుక?

on Aug 21, 2023

ఎంత టాలెంట్ వున్నా సినిమా రంగంలో హీరోగా నిలదొక్కుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందునా ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా హీరోగా సక్సెస్ అవ్వడం అసాధ్యమనే చెప్పాలి.  అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా దిగ్గజాలుగా చెప్పబడే కొందరు హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో మెరుపుతీగలా వచ్చి మాస్ హీరోకి, కమర్షియల్ హీరోకి కొత్త అర్థం చెప్పారు చిరంజీవి. ప్రాణం ఖరీదు చిత్రంతో పరిచయమైన చిరంజీవి 45 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, మరెన్నో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. కమర్షియల్ సినిమా అంటే ఇదీ అని తన సినిమా కలెక్షన్లతోప్రూవ్ చేసారు. కేవలం స్వయంకృషితో హీరోగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన మెగాస్టార్ ఎంతోమందికి  ఆదర్శం. 

అన్నయ్యా అని అందరూ ప్రేమగా పిలుచుకునే చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఖైదీ నంబర్ 150తో స్టార్ట్ చేసి 60 ఏళ్ళు పైబడ్డా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసారు. తన స్టెప్పులతో, యాక్షన్ తో ప్రేక్షకులను, అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఉయ్యాల నరసింహారెడ్డి జీవిత చరిత్రను సినిమా తియ్యాలన్న తన చిరకాల కోరికను సైరా నరసింహారెడ్డి చిత్రంతో తీర్చుకున్నారు. తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కి తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం ఆ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత. 
ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్. ఇప్పుడు మెగాస్టార్ చేయబోయే 156, 157 చిత్రాలకు సంబంధించిన అప్ డేట్స్ పైనే అందరి దృష్టీ ఉంది. ప్రతి సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి ఏదో ఒక విశేషం ఉండనే ఉంటుంది.

మరి ఈసారి మెగాభిమానులకు చిరు అందించే గిఫ్ట్ ఏమిటి అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా తను చేయబోయే కొత్త సినిమాల తాలూకు న్యూస్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.  ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మెగాస్టార్ 156వ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అలాగే 157వ సినిమాను బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లో దేనికి సంబంధించిన న్యూస్ ను ఆగస్టు 22న ఎనౌన్స్ చేస్తారు? లేదా రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను అందిస్తారా? అనేది తెలియాలంటే మంగళవారం వరకు వేచి చూడాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.