చిరంజీవి, బాబీ సినిమా అప్ డేట్.. ఆ ఇద్దరు హీరోయిన్స్ అదృష్టవంతులా!
on Oct 13, 2025

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కానుండటంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి 'బాబీ'(Bobby) దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో 'వాల్తేరు వీరయ్య' వంటి బిగ్గెస్ట్ హిట్ వచ్చి ఉండటంతో, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.
బాబీ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి సరసన రాశి ఖన్నా(Raashi Khanna),మాళవిక మోహనన్(Malavika Mohanan)జతకట్టే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాబీ ఈ ఇద్దరి హీరోయిన్స్ ని సంప్రదించాడని,వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానుందనే టాక్. రాశి ఖన్నా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో చేస్తుంది. దీంతో చిరంజీవితో చెయ్యడం ఖాయమైతే కనుక ఆమె కెరీర్ కి మరింత హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది.మాళవిక మోహనన్ కూడా ప్రస్తుతం ప్రభాస్ వన్ మాన్ షో 'ది రాజాసాబ్' లో చేస్తుంది. ఇప్పుడు చిరంజీవి, బాబీ చిత్రంలో కన్ఫార్మ్ అయితే ఆమె కెరీర్ కి మరింత హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరు తమ అందంతో, పెర్ ఫార్మెన్సు తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక చిరంజీవి, బాబీ సినిమా ఫుల్ మాస్ ఫ్లెడ్జెడ్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతుంది. వాల్తేరు వీరయ్యని మించిన కమర్షియల్ అంశాలు ఉండటమే కాకుండా, చిరంజీవి ని ఇంతవరకు ఎవరు చూపించని సరికొత్త మాస్ యాంగిల్ లో బాబీ చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. కె వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా చిరంజీవి నుంచి వస్తున్న 158 వ చిత్రం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



