అంబికావారి ఫంక్షన్ లో చిరు, బాలయ్య ఇద్దరూ విడివిడిగా వెళ్ళారు. వివరాల్లోకి వెళితే ఏలూరు మాజీ యమ్.యల్.ఎ., నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ హీరోగా "వీరభద్ర" అనే సినిమాని నిర్మించిన ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కుమారుడు అంబికా హనుమ, లావణ్యల పెళ్ళి రిసెప్షన్ నిన్న ఏలూరులో ఘనంగా జరిగింది.
.jpg)
అంబికా వారి ఈ పెళ్ళి రిసెప్షన్ కి తెలుగు సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులూ హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. వారిలో ముఖ్యంగా యువరత్న నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కొణిజేటి రోశయ్య,ప్రముఖ నిర్మాతలు డాక్టర్ డి.రామానాయుడు, రామోజీరావు తదితరులు ఈ పెళ్ళి రిసెప్షన్ కు హాజరయ్యారు. విచ్చేసిన వారిలో బాలయ్య, చిరంజీవి ఈ పెళ్ళి రిసెప్షన్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.
.jpeg)




(2).jpeg)
(1).jpg)
