Home

»

Latest News

Chiraiya web Series Review: చిరైయా వెబ్ సిరీస్ రివ్యూ

Mar 20, 2026

వెబ్ సిరీస్ : చిరైయా
నటీనటులు: దివ్య దత్తా, సుకుమార్  భ్రమర్, ప్రసన్న బిస్త్, సిద్దార్థ్ షా,  ఫైజల్ రషీద్, టిన్ను ఆనంద్ తదితరులు
రచన: దివ్య నిధి శర్మ
ఎడిటింగ్: అసీమ్ సిన్హా
సినిమాటోగ్రఫీ: శుభంకర్ భర్
మ్యూజిక్:  రాజా నారాయణ్ దేబ్
నిర్మాతలు:  శ్రీకాంత్ మెహ్త, మహేంద్ర సోని
దర్శకత్వం: శశాంత్ షా
ఓటీటీ: జియో హాట్ స్టార్

కొత్తదనంతో కూడిన బోల్డ్ కథలను అందించడంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎప్పుడూ ముందుంటాయి. తాజాగా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'చిరైయా' (Chiraiya) వెబ్ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం.


కథ:

లక్నో సిటీలో సంజయ్ మిశ్రా( సుకుమార్ భ్రమర్) ది గొప్ప పేరున్న కుటుంబం. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు భార్య కమలేశ్(దివ్య దత్తా), చిన్న కొడుకు అరుణ్ కి పూజ(ప్రసన్న బిస్త్) తో వివాహం జరుగుతుంది. ‌మొదటి రాత్రి పూజకి ఇష్టం లేకున్నా అరుణ్ బలవంతం చేస్తాడు. మొదటి రాత్రి తర్వాత తను ఆ గిల్టీని భరించలేకపోతుంది. తనకి నచ్చినట్లు ఉండలేని ఉంట్లో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి తన బాధని చెప్పుకుంటే పూజ వాళ్ళ అమ్మ అర్థం చేసుకోకపోగా తిరిగి మామయ్య గారి ఇంటికి పంపించేస్తుంది. దాంతో పూజకి ఏం చేయాలో తెలియదు.‌ఇక మరోసారి పూజ పట్ల అరుణ్ విచక్షణారహితంగా బలవంతం చేస్తాడు. ఇక పూజ భరించలేకపోతుంది. ఇక అరుణ్ వాళ్ళ నాన్న అరుణ్, పూజలని హానీమూన్ కి పంపిస్తాడు. దాంతో పూజ పరిస్థితి మరీ దారుణంగా మారిపోతుంది. అరుణ్ చేతిలో కీలు బొమ్మలా మారిపోతుంది. తనకి ఏ మాత్రం ఇష్టం లేకున్నా, అసలు తన ఇష్టాలేవో తెలుసుకోకుండా అరుణ్ అలా చేయడం పూజకి ఇష్టం లేకుండా ఒక బ్లేడ్ తో తనని తాను గాయం చేసుకుంటుంది. ఇక పూజ తను అనుభవించిన బాధలని అరుణ్ నిజస్వరూపాన్ని అక్క కమలేశ్(దివ్య దత్తా)కు చెప్తుంది. మరి పూజకి న్యాయం జరిగిందా? కమలేశ్ ఏం చేసింది? అరుణ్ తన తప్పు తెలుసుకున్నాడా లేదా అనేది మిగతా కథ.


పూజ , అరుణ్ ల వివాహం తర్వాత పూజకి ఇష్టం లేకున్నా అరుణ్ బలవంతం చేస్తాడు. మొదటి రాత్రి తర్వాత తను ఆ గిల్టీని భరించలేకపోతుంది. తనకి నచ్చినట్లు ఉండలేని ఉంట్లో ఉండలేక వెళ్ళిపోతుంది. 

విశ్లేషణ:

ఒక పక్షి తనకి నచ్చినట్లు స్వేచ్చగా ఎగురుతూ వెళ్తుంది. అది మిగతా వాటి గురించి ఆలోచించి ఎగిరిపోకుండా ఒకే చోట ఉండిపోదు. అలా అని దాని స్వేచ్చని నిలిపేస్తే అది చూస్తూ ఊరుకోదు. ఈ చిరైయా(chiraiya) వెబ్ సిరీస్ లో పూజ కూడా తనకి నచ్చినట్లు ఉండాలని అనుకుంటుంది. కానీ తన ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా తన భర్త చేసిన శారీరక హింసని ప్రతిఘటిస్తుంది. తన స్వేచ్ఛని కాపడుకునే ప్రయత్నంలో తనకి అండగా కమలేశ్ ఉంటుంది. 

ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ ముప్పై నిమిషాల వరకు ఉంటుంది. మొదటి ఎపిసోడ్ ముప్పై మూడు నిమిషాలు ఉంది. ఇందులో కమలేశ్, అరుణ్ , సంజయ్ మిశ్రా ఫ్యామిలీ క్యారెక్టర్స్ పరిచయం అవుతాయి. అలాగే పూజ, అరుణ్ ల వివాహం జరుగుతుంది.   రెండో ఎపిసోడ్ ఇరవై ఏడు నిమిషాలు ఉంది. పూజ తన పుట్టింటికి వెళితే వాళ్ళు తిరిగి అత్తామామయ్యల ఇంటికే పంపిస్తారు. మూడో ఎపిసోడ్ లో అరుణ్, పూజ హనీమూన్ కి వెళతారు. అక్కడ పూజ పడిన బాధలని చూపిస్తారు.

నాలుగో ఎపిసోడ్ ఇరవై నాలుగు నిమిషాలు ఉంది. ఇందులో తన హాస్పిటల్ లో ఉంటే కమలేశ్ కి పూజ నిజం చెప్పడంతో తను పడిన బాధని కమలేశ్ గ్రహిస్తుంది. ఇక అయిదో ఎపిసోడ్ ఇరవై ఏడు నిమిషాలు ఉంది. ఇందులో అరుణ్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది కమలేశ్. దాంతో కమలేశ్ వాళ్ళ మామయ్య ఒప్పుకోడు. ఇక కమలేశ్ చేసేదేమీ లేక పూజని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. ఇక చివరిదైన ఆరో ఎపిసోడ్ ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది. ఇందులో ఇద్దరు కోడళ్లు ఇంటికి వస్తారు. చివరగా వాళ్ళకి ఎలా న్యాయం జరిగిందనేది చూపిస్తారు. ఒక సున్నితమైన అంశాన్ని వాస్తవిక కోణంలో చూపించారు దర్శకుడు.

సిరీస్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్. ఇది పూర్తిగా 18+ ఆడియన్స్ కు ఉద్దేశించిన కంటెంట్. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ, ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ఈ 'మస్ట్ వాచ్' సిరీస్ ఇది. ఈ సిరీస్ మెయిన్ గా పెళ్ళి అయిన ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలపై ఉంటుంది. ఆడదాని ఇష్టం లేకుండా ఏ మగాడు తన మీద చేతిని కూడా వేయలేడు. అలాంటిది బలవంతం చేస్తే ఊరకోదు అని చెప్తూ తీసిన ఈ సిరీస్ ఒక మెసెజ్ ని ఇస్తుంది. ఆడవాళ్ళ హక్కుల కోసం తన స్వేచ్చని తిరిగి పొందడానికి పూజకి కమలేశ్ ఉంది. మరి నిత్యం సమాజంలో ఆడవాళ్ళు ఇంట్లో  , బయట అనుభవిస్తున్న వేదింపులకి ఎవరు నిలబడాతారు అంటూ చివరి ఎపిసోడ్ లో ఇచ్చే కన్ క్లూజన్ బాగుంది. కొన్ని అడల్ట్ సీన్లు ఉన్నాయి. పిల్లలతో కలిసి ఈ సిరీస్ ని చూడకపోవడమే బెటర్. శుభంకర్ భర్ సినిమాటోగ్రఫీ ఈ సిరీస్ మూడ్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది. మ్యూజిక్ ఒకే. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:  కమలేశ్ గా దివ్య దత్తా నటన సిరీస్ కి ఫ్రధాన బలంగా నిలిచింది. పూజగా ప్రసన్న బిస్త్ , సిద్దార్థ్ షా గా అరుణ్, సుకుమార్ భ్రమర్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. 

ఫైనల్ గా : మస్ట్ వాచెబుల్ సిరీస్ .

 

రేటింగ్: 2.5 /5

✍️. దాసరి  మల్లేశ్

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com