Home

»

Latest News

Chiraiya: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం,బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న మూవీ 

Mar 26, 2026

 

 

-ఓటిటిలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న మూవీ
-మహిళా సాదరికతపై ప్రశ్నలు 
-భార్య అయినా శృంగారం అనేది ఇష్టం ఉండాల్సిందే 
-ఇంతకీ ఆ సిరీస్ ఏంటి 

 

సినీయుగంలో ఓటిటి యుగం కూడా వాటా దక్కించుకున్న ఈ రోజుల్లో డిఫరెంట్ జోనర్స్ తో కూడిన పలు ఓటిటి చిత్రాలు ప్రేక్షకులకి సరికొత్త మజాని ఇవ్వడంలో ఏ మాత్రం వెనుకంజ వెయ్యడం లేదు. థియేటర్ చిత్రాలతో పోటీపడి సై అంటే సై అంటున్నాయి. ఆ కోవలోనే వచ్చిన తాజా చిత్రం 'చిరాయ'. ఈ నెల 20 నుంచి జియో హాట్ స్టార్(Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రీమింగ్ అవుతుండటమే కాదు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ ఎన్నో చర్చలని లేవనెత్తుతూ ట్రెండింగ్ లో ఉంది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం.

వివాహం తర్వాత మహిళపై జరుగుతున్న వైవాహిక అత్యాచారం అనే కాన్సెప్ట్ అధారంగా చిరాయ తెరకెక్కింది. శృంగారం విషయంలో భార్య సమ్మతి కూడా ముఖ్యమనే విషయాన్నీ కూడా ఎలాంటి బెరుకు లేకుండా చెప్పడంతో పాటు విషపూరితమైన  పురుషాహంకారాన్ని తెలియచేసింది. కథగా చూసుకుంటే 'కమ్లేష్' అనే మహిళ ఒక  ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలు. తన మరిది చాలా మంచివాడని నమ్మి పూజా అనే అమ్మాయితో వివాహం జరిపిస్తుంది. కానీ పెళ్లి తర్వాత అరుణ్ అసలు రూపం బయటపడుతుంది. పూజాని మానసికంగా హింసిస్తుండటమే కాకుండా పూజకి ఇష్టం లేకపోయినా శారీరకంగా అనుభవించాలనుకునే పెద్ద సైకో. మరి భర్త వేధింపుల నుంచి ఎలా బయటపడిందనేదే చిరాయ. 


also read: Dhurandhar 2: హంజాతో అలజడులు సృష్టించాలనుకుంటున్నారా! వార్నింగ్ ఇస్తున్న ఆదిత్య ధర్   


మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉండగా ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. తెలుగు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో సహా మొత్తం పదకొండు  భాషల్లో అందుబాటులో ఉంది. మరి గృహ హింస, వైవాహిక అత్యాచారాల తీవ్రతని కళ్లకు కట్టినట్లు చూపించిన చిరాయని ఇప్పుడే చూడండి. ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించగా శశాంత్ షా(Shashant Shah) దర్శకుడు.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com