Home

»

Latest News

చిరంజీవికి చరణ్ గిఫ్ట్!

Jul 9, 2016 4:07PM


ప్రస్తుతం తన తండ్రి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్.. చిరంజీవి పుట్టినరోజుకి మరో బహుమతిని ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. "బ్రూస్ లీ" లాంటి డిజాస్టర్ అనంతరం తమిళ చిత్రం "తాని ఒరువన్"ను రీమేక్ చేస్తున్న చరణ్ ప్రస్తుతం ఈ చిత్రంలో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేసేందుకు చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. 
అల్లు అరవింద్ నిర్మిస్తున్న "ధృవ" చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదల చేయనున్నారు. ప్రతినాయకుడిగా తమిళ వెర్షన్ లో నటించిన అరవింద స్వామి తెలుగు వెర్షన్ లోనూ నటిస్తుండగా.. నవదీప్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com