Home

»

Latest News

chandrababu Naidu: వెండి తెరపై చంద్రబాబు నాయుడు బయోపిక్.. దర్శకుడు ఎవరో తెలిస్తే హ్యాపీగా ఫీలవుతారు

Apr 22, 2026

 

 

-అలుపెరగని పోరాటయోధుడు
-అభివృద్దే తన అజెండా 
-శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం 
-బయోపిక్ కి ముహూర్తం 


 తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, అభిమానుల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu Naidu)బయోపిక్ సెల్యులాయిడ్ పైకి అడుగుపెడుతుంటే ఆనందపడని తెలుగు వారు ఉంటారా.. ఉండనే ఉండరు. ఆ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ అలాంటిది. చంద్ర బాబు బయోపిక్ కి ముహూర్తం సిద్దమయ్యింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.  


‘రాజధాని ఫైల్స్’(Raajadhani Files)చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్న దర్శకుడు భాను(Bhanu). భాను దర్శకత్వంలోనే చంద్రబాబు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ విషయంపై భాను మాట్లాడుతు సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ప్రపంచం యొక్క మెప్పుపొంది, దార్శనికుడిగా, లోకనాయకుడిగా చంద్రబాబు ఎదిగిన ప్రయాణం దేశంలోని ప్రతీ పౌరుడికీ ఆదర్శప్రాయం. నిఘంటువులోని ప్రతి అక్షరానికీ ఒక అర్థం. ప్రతి పదానికీ ఒక భావం ఉన్నట్టే ఆయన జీవితంలోని ప్రతి అడుగూ ప్రజాక్షేమం కోసం. ఆయన ప్రతీ ఆలోచన భావితరాల భవిష్యత్తు కోసం. అటువంటి విజనరీ నాయకుడు, అలుపెరగని పోరాటయోధుడు, నిత్యకృషి వలుడు. అయన  జీవితంలో జరిగిన ప్రతీఘట్టంలో ఒక ఉద్వేగం. ఒక సంఘర్షణ ఉంది. ఆ ఉద్వేగాల సమాహారమే చంద్రబాబు బయోపిక్ అని భాను చెప్పుకొచ్చాడు.


also read: Priyanka Chopra: ఓటిటిలోకి ప్రియాంక చోప్రా.. వారణాసి కంటే ముందే 240 దేశాల్లో


పాన్ వరల్డ్ చిత్రంగా అన్ని ప్రపంచభాషల్లోనూ రూపొందుతుండగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిర్మించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో, భారీ తారాగణంతో తెరకెక్కబోతుండగా  టైటిల్, నిర్మాణ సంస్థ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

 

 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com