నిన్న నాని.. నేడు నాగచైతన్య..!
on Sep 20, 2021
`నిన్ను కోరి`, `మజిలీ` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. అయితే, మూడో చిత్రంగా రూపొందిన `టక్ జగదీష్` మాత్రం ఆశించిన ఫలితాన్ని, గుర్తింపుని ఇవ్వలేకపోయింది. ఇటీవల ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. శివ కెరీర్ లో ఫస్ట్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. తన నాలుగో చిత్రాన్ని యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో చేయాల్సిన శివ నిర్వాణ.. `టక్ జగదీష్` ఫలితం కారణంగా ఆ అవకాశం మిస్సయినట్లు టాలీవుడ్ టాక్. ఈ క్రమంలోనే.. ఇప్పుడదే సబ్జెక్ట్ ని తన లక్కీ హీరోల్లో ఒకరైన నాగచైతన్యతో తీయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే చైతూ, శివ మధ్య చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
మొత్తమ్మీద.. తన ఫస్ట్ ఫిల్మ్ `నిన్ను కోరి` హీరో నానితో తన మూడో చిత్రం `టక్ జగదీష్` చేసిన శివ.. సెకండ్ ప్రాజెక్ట్ `మజిలీ` హీరో అయిన నాగచైతన్యతో నాలుగో సినిమా చేయబోతుండడం విశేషమనే చెప్పాలి. మరి.. చైతూతో అయినా రెండో ప్రయత్నంలోనూ శివ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Also Read