.jpg)
ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ఈ రోజు కన్నుమూశారన్న వార్తతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ప్రసాద్ మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తెలపారు. ఇద్దరం కలసి చాలా సినిమాల్లో నటించామన్నారు. చాల ప్రెండ్లీగా ఉండేవాడని భరణి ఈ సందర్బంగా ప్రసాద్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ మధ్య 20 ఏళ్లగా పరిచయం ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏదో శని పట్టినట్లుందని తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మృతి చెందిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఆహుతి ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నటుడు గిరిబాబు అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో బాబాయి బాబాయి అంటూ ఉండే వాడని ఆయన తెలిపారు.




.jpg)
.jpg)
