Home

»

Latest News

సెలెబ్రిటీ క్రికెట్ లో సౌత్ సూపర్ స్టార్స్ గెలిచారు

Mar 6, 2011 3:07PM

Celebrity Cricket League, South Superstars, South Superstars win, CCL cricket, Mumbai heroesసౌత్ సూపర్ స్టార్స్ , బాలీవుడ్ హీరోస్ కీ మధ్య విశాఖపట్టణంలో, వై యస్ రాజశేఖర రెడ్డి స్టేడియమ్ లో జరిగిన సి.సి.యల్. ( సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ )కర్టెన్ రైజర్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో సౌత్ సూపర్ స్టార్స్ నిజంగానే సూపర్ స్టార్స్ అనిపించారు. అంటే ఈ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో సౌత్ సూపర్ స్టార్స్ 36 పరుగుల తేడాతో బాలీవుడ్ హీరోస్ మీద ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ సూపర్ స్టార్స్ నిర్ణీత ట్వంటీ ఓవర్లలో నూటతొంభై మూడు పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని బాలీవుడ్ హీరోస్ ముందుంచింది.

సౌత్ సూపర్ స్టార్స్ కెప్టెన్ వెంకటేష్ బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ చివరి బంతిని సిక్సర్ గా మలచి స్టేడియంలోనూ, టి.వి.ల ముందు వీక్షిస్తున్న అశేష అభిమానులను అలరించారు. సౌత్ సూపర్ స్టార్స్ లో నందమూరి తారకరత్న పదమూడు బంతుల్లోనే ముప్పై పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన బాలీవుడ్ హీరోస్ ని సౌత్ సూపర్ స్టార్స్ కేవలం నూట యాభై ఏడు పరుగులకు మాత్రమే కట్టడి చేయగలిగి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ హీరోస్ కీ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com