Home

»

Latest News

మేకర్స్ ,హీరో, హీరోయిన్స్ కి షాక్: జయహో ప్రేక్షక మహాదేవా!

Sep 19, 2026 5:18PM

 

కొన్ని సినిమాలు అంతేనండి బాబు. ఆ మాటకొస్తే కొన్ని సినిమాలు ఏముందిలే మాగ్జిమమ్ చాలా సినిమాల్లో డ్రగ్, హింస చాలా ఎక్కువ మోతాదులో ఉంది. విచిత్రంగా హీరో నే వాటికి బానిసగా ఉంటాడు. హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేసి ఇద్దరు తమ మధురమైన ప్రేమ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అదే బాపతుని అవలంబించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రేక్షకుడు 'స్వామి వివేకానంద. అవతారం కాదు కదా!

వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2026  సినిమాటోగ్రాఫ్ చట్టం కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) కోసం సరికొత్త మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల్లో అత్యంత ప్రధానమైన మార్పు డ్రగ్స్ , మత్తు పదార్థాల దృశ్యాలకి  సంబంధించినది. సినిమాలో మాదకద్రవ్యాల వాడకం, విక్రయం లేదా ట్రాఫికింగ్ సన్నివేశాలు వచ్చినప్పుడు, తెరపై ఖచ్చితంగా "అక్రమ మత్తుపదార్థాలు ఆరోగ్యానికి హానికరం మరియు ఖచ్చితంగా జైలు శిక్షకు దారితీస్తాయి. డ్రగ్స్‌కు నో చెప్పండి" అనే చట్టబద్ధమైన హెచ్చరిక సందేశాన్ని ప్రదర్శించడం ఇకపై తప్పనిసరి చేశారు. గతంలో సిగరెట్, మద్యం సన్నివేశాలకు మాత్రమే పరిమితమైన ఈ హెచ్చరికలు, ఇకపై మత్తు పదార్థాల దృశ్యాలకు కూడా వర్తిస్తాయి. కేవలం సినిమాలకే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లకు కూడా ఇదే తరహా నిబంధనలను పాటించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.

దీనితో పాటు, సినిమాల వయస్సు వారీ వర్గీకరణలో కూడా స్పష్టత తెచ్చారు. మే 2025లో అమల్లోకి తెచ్చిన 'U/A 7+', 'U/A 13+' మరియు 'U/A 16+' వర్గీకరణలను ఈ నూతన గైడ్‌లైన్స్‌లో మరింత బలోపేతం చేశారు. దీనివల్ల తమ పిల్లలు ఏ రకమైన కంటెంట్ చూస్తున్నారో తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు మరింత స్పష్టమైన అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా, సమాజంలో హింస, నేర విధానాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రాచుర్యంలోకి తెచ్చేలా లేదా గ్లామోరైజ్ చేసేలా చూపించకూడదని సీబీఎఫ్‌సీ స్పష్టం చేసింది. దేశద్రోహ ఆలోచనలు, మత విద్వేషాలు, శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమైన విషయాలు, విదేశాలతో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే అంశాలు లేకుండా జాగ్రత్తలు వహించాలని బోర్డు తేల్చిచెప్పింది.

ఇది కూడా చదవండి: విజయ్ ఫోన్ కాల్ సీక్రెట్ బయటపెట్టిన విజయ్ సేతుపతి.. ఫుల్ వైరల్ మామ!

 

 


మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో ఒక సన్నివేశాన్ని మాత్రమే విడిగా చూడకుండా, సినిమా మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి సర్టిఫికేషన్ ఇస్తారు. కళాత్మక స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య సరైన సమతుల్యత సాధించడమే లక్ష్యంగా సెన్సార్ బోర్డ్‌ను 18 మంది ప్రముఖులతో ఇటీవల పునర్వ్యవస్థీకరించారు. నటులు ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, పల్లవి జోషి, డైరెక్టర్ ప్రియదర్శన్ మరియు ఆస్కార్ విజేత రిక్కీ కేజ్ వంటి ప్రముఖులు ఈ కొత్త బోర్డులో సభ్యులుగా ఉన్నారు.దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే డిసెంబర్ 1991 నాటి పాత నిబంధనల స్థానంలో ఈ కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి రావడం విశేషం. ఈ సరికొత్త నిబంధనలు చలనచిత్ర రంగానికి మరియు ప్రేక్షకుల వీక్షణ విధానానికి అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనున్నాయి. 

 

మీకు నచ్చవచ్చు : నా మనసుకేమయింది: 90s కిడ్స్ ఫేవరెట్ సాంగ్.. సిరివెన్నెల కలం చేసిన మ్యాజిక్.!
     

 

[Cbfc, Cbfc New Film Certification Guidelines 2026, mandatory drug warnings , censor board new rules, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com