స్టార్ హీరో ప్రొడక్షన్‌లో క్యాస్టింగ్ కౌచ్.. షాక్ అయిన ఇండస్ట్రీ?
on Oct 16, 2025
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇటీవలి కాలంలో దీని గురించి చాలా వార్తలు వచ్చాయి. క్యాస్టింగ్ కౌచ్‌కి గురయ్యామంటూ ఎంతో మంది నటీమణులు తెరపైకి వచ్చారు. మీటూ పేరుతో ఉద్యమం కూడా నడుస్తోంది. ఇప్పుడు మరోసారి క్యాస్టింగ్ కౌచ్ కలకలం మొదలైంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ ఆరోపణలు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. వేఫేరర్ ఫిలింస్ పేరుతో దుల్కర్ స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ ఈ వివాదంలో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వేఫేరర్ ఫిలింస్ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దినిల్‌బాబు.. సినిమా అవకాశం ఇస్తానని చెప్పి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఎర్నాకుళం సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దినిల్ బాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తమ సంస్థపై వచ్చిన ఆరోపణలపై వేఫేరర్ ఫిలింస్ వెంటనే స్పందించింది. దినిల్‌బాబుతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తమ సంస్థ పేరుతో దినిల్ మోసాలకు పాల్పడుతున్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేఫేరర్ ఫిలింస్ విడుదల చేసిన ప్రకటనలో ‘మా సంస్థ క్యాస్టింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇదంతా సోషల్ మీడియా పేజీల ద్వారానే ప్రకటిస్తాం’ అని తెలిపింది. వేఫేరర్ ఫిలింస్‌పై వచ్చిన ఆరోపణలపై దుల్కర్ అభిమానులు స్పందిస్తున్నారు. దుల్కర్ వంటి ఇమేజ్ ఉన్న వ్యక్తికి సంబంధించిన సంస్థపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమంటున్నారు. సంస్థ విడుదల చేసిన ప్రకటనతో ఈ వివాదానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావడంతో దుల్కర్ అభిమానులు, నెటిజన్లు అతనికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



