Home

»

Latest News

‘దసరా’కి భారీ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా!?

Feb 14, 2023 10:17AM

నాచురల్ స్టార్ నాని దసరా చిత్రంలో విభిన్నంగా కనిపిస్తున్నారు.  మాసిన గడ్డం, చెదిరిన జుట్టు, లుంగీ మాసిపైన చొక్కాల తో ఫుల్ మాస్ అవ‌తార్‌లో అదిరిపోయేలా ఫోజిస్తున్నారు.  ఈ సినిమా కూడా విభిన్నంగా తెరకెక్కుతుందని అంటున్నారు. కాగా దసరా చిత్రానికి కొత్త దర్శకుడైన శ్రీకాంత్ ఓదెలా దర్శకుడు. మునుపెన్నడూ లేని విధంగా కొత్త లుక్ లో నాని కనిపిస్తూ ఉండడంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. వాస్తవానికి టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో నాని ఒకరు.

ఆయన సినిమాలకు 30 కోట్లు పెడితే సేఫ్ బడ్జెట్. సినిమా మంచి టాక్ వస్తే 50 కోట్ల దాకా బిజినెస్ గ్యారెంటీ అయితే కొంతకాలంగా నాని నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నారు. ఒకప్పుడు ఏకంగా ట్రిపుల్ హ్యాట్రిక్  మిస్సయిన ఈయన ఇప్పుడు వరుస విజయాలను అందించలేకపోతున్నారు. ఇటీవల విడుద‌లైన  అంటే సుందరానికి చిత్రానికి కాస్త పాజిటివ్ టాక్  వచ్చిన కలెక్షన్లు లేకుండా పోయాయి. అయినా కూడా దసరా చిత్రానికి నిర్మాత సుధాకర్ చెరుకూరి 35 కోట్ల బడ్జెట్లో పెట్టడానికి రెడీ అయ్యార‌ని స‌మాచారం.  

అయితే ఈ బడ్జెట్ విపరీతంగా పెరిగిందట. సరైన ప్రణాళిక ఏదీ లేకపోవడంతో బడ్జెట్ కొన్ని కోట్లు పెరిగిందని సమాచారం. శ్రీ‌కాంత్  ఓదెల ప్రణాళిక ప్రకారం సినిమాని తీయలేకపోయారా? లేదా క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని.... సినిమా పెద్ద రేంజ్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని అదనంగా ఖర్చు పెట్టారా అనేది అర్థం కాని విషయం. బహుశా బిజినెస్ ఆఫర్లను చూసి టెంప్ట్ అయి ఉంటారని కొందరు అంటున్నారు. మొత్తానికి బడ్జెట్ అనుకున్న దానికంటే రెట్టింపు అయిందట.  నాని ఒక్కడికే 15 కోట్ల దాకా రెమ్యూన‌రేష‌న్ ఇచ్చినట్లు  సమాచారం. కీర్తి సురేష్ కూడా స్టార్  హీరోయిన్ కావడం.... పేరున్న  ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేయడం.... వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోవడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని అంటున్నారు.

ఇకపోతే అన్ని హక్కులు కలుపుకొని ఈ చిత్రానికి 80 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి నానికి దసరా హిట్ అనేది కచ్చితంగా అత్యవసరం. ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు వస్తాయి. నాని తన స్టామినాను నిరూపించుకోవాలంటే దసరానే అత్యంత కీలకమని చెప్పాలి. ఈ చిత్రం ద్వారా ఆయ‌న  తన పూర్వ వైభవాన్ని సాధిస్తాడా లేదా అనేది వేచి  చేయాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com