Home

»

Latest News

సినిమా వాళ్లపై మహేష్ కాంట్రవర్సీ కామెంట్..!

May 7, 2016 10:59PM

ఎప్పుడూ సెన్సేషన్ కు, కాంట్రవర్సీకి దూరంగా చాలా సింపుల్ మాటలతో మాట్లాడతాడు మహేష్. ఆడియో ఫంక్షన్లయినా, ప్రెస్ మీట్లయినా నోరు జారడం ఎప్పుడూ కనబడదు. కానీ బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్లో మాత్రం కొద్దిగా టంగ్ స్లిప్ అయ్యాడు సూపర్ స్టార్. తన స్పీచ్ లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడుతూ ఆయనంటే తనకు చాలా ఇష్టమని, చాలా స్వచ్ఛమైన మనిషని పొగడ్తలతో ముంచేశాడు మహేష్. అయితే ఆ వెంటనే, సినిమా ఇండస్ట్రీ వాళ్లతో ఆయన ఎక్కువ కలవడు. బహుశా అందుకే అంత మంచిగా ఉంటాడు ఆయన అంటూ స్టేట్ మెంట్ వదిలేశాడు. పొరపాటున టంగ్ స్లిప్ అయ్యాడా..లేక నిజంగానే మహేష్ కు ఇండస్ట్రీ అంటే అంత కోపమా అంటూ ఈ మాటలు సరిగ్గా గమనించిన వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. శ్రీకాంత్ లో పాటు, సత్యరాజ్ ను కూడా ఆకాశానికెత్తేశాడు మహేష్. తాను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసేవాడినని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. మిగిలిన స్పీచ్ అంతా బాగానే ఉన్నా, శ్రీకాంత్ అడ్డాలను పొగిడే విషయంలోనే, అనవరసంగా సినీఇండస్ట్రీకి సెటైర్ వేశాడేమో అని సినీజనాలు ఓ ఇదైపోతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com