నేను ఆ సినిమాలు చేయలేను-బోయపాటి
on Jan 10, 2019
నా నుంచి ఆడియన్స్ ఏదైతే ఆశిస్తారో అలాంటి సినిమాలే చేస్తాను. చిన్న సినిమాలు నేను చేయలేను. ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ ఒకలా ఉండి...మన ప్రొడక్ట్ ఒకలా ఉంటే మ్యాచ్ అవదు. అందుకే నేను చిన్న సినిమాలు చేయలేను. ఒక వేళ బయోపిక్ చేసినా..అందులో కూడా మాంచి దమ్ముండాలి అంటున్నారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. రామ్ చరణ్ తో తాజాగా బోయపాటి తెరకెక్కించిన చిత్రం `వినయ విధేయ రామ`. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 11న రానుంది. ఈ సందర్భంగా బోయపాటి మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..``` ఏ హీరోతో సినిమా చేసినా..ఆ హీరోకి ఫ్యాన్ లా మారి సినిమా చేస్తాను. చరణ్ కోసం స్టోరి రాసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ సీట్లో కూర్చుని చూస్తున్నట్లుగా ఫీలై స్టోరి రాసుకున్నా. ప్రతి హీరోకి నేను అలాగే చేస్తా. `వినయ విధేయ రామ` సినిమా కూడా అలాంటిదే. నాకు రామ్ చరణ్ లో నచ్చింది అంటే ఆయన అస్సుల తృప్తి చెందరు. ఇంకా ఏదో కావాలి , ఏదో చేయాలి అంటూనే ఉంటారు. ఇలాంటి వారు ఎ ప్పటికీ ఎదుగుతూనే ఉంటారు. మా సినిమాలో వివేక్ ఒబేరాయ్ ఓ క్యారక్టర్ కి సరిపోతాడని వెళ్లి కలిసినపుడు ఆయన మొదట నేను చేయను అని చెప్పేశారు. రక్త చరిత్ర లాంటి సినిమా అయితే తప్ప నేను చేయను అన్నట్టుగా చెప్పేశారు. ఓకే మీరు చేయకండి..కానీ ఒకసారి స్టోరి వినండి అన్నాను. స్టోరి విన్నారో లేదో వెంటనే ఓకే చెప్పారు. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశారు. అలాగే మిగతా ఆర్టిస్టులందరూ కూడా వారి పాత్రలు నచ్చి సినిమా చేశారు.