అక్షయ్ స్టన్నింగ్ సెల్ఫీ..
on Nov 7, 2016
ఇటీవలి కాలంలో యువత ఎక్కడికి చేరినా..ఫేవరేట్ స్టార్ కనిపించినా వెంటనే వారితో సెల్ఫీ దిగడమే. ట్రైన్ బ్యాక్‌గ్రౌండ్‌లో సెల్ఫీ, బిల్డింగ్ టాప్ ఎండ్‌లో సెల్పీ, మొసలి నోట్లో సెల్ఫీ,..ఇలా ఎక్కడ చూసినా సెల్ఫీల మయమే. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా నిత్యం ఏదో ఒక సందర్భంలో సెల్ఫీ తీసుకునేవారే. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా సెల్ఫీ దిగాడు. ఆ..ఇది అందరూ చేసేదేలే అని మీరు అనుకోవచ్చు..కానీ మిగిలిన వారు ఏ ప్రముఖుడితోనో...లేదంటే ఏ కుక్కతోనే...ఏ మొక్కతోనే సెల్ఫీ దిగేవారు. వీరందరికి భిన్నంగా సెల్ఫీ దిగాడు అక్షయ్.
మరుగుదొడ్డి అంటేనే మనం ముక్కు ముసుకుంటాం. అలాంటిది టాయ్‌లెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో సెల్పీ తీసుకున్నాడు అక్షయ్. అసలు మ్యాటరేంటంటే ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ పథకం ఆధారంగా "టాయ్‌లెట్-ఎక్ ప్రేమ్‌కథ" సినిమాలో అక్షయ్ నటిస్తున్నాడు. ఈ సినిమా తొలిరోజు షూటింగ్ మధురలో జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ భూమి పడ్నేకర్‌తో కలిసి మరుగుదొడ్డిలో సెల్ఫీ దిగి తన ట్విట్టర్లో పెట్టారు అక్షయ్ కుమార్. శ్రీనారాయణ్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ స్వచ్ఛత అంశం చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇటీవల మరుగుదొడ్డి లేని కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెళ్లికూతుళ్లు పెళ్లిని నిరాకరించడం, భర్తను వదిలిపెట్టడం వంటి అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట.