Home

»

Latest News

రంగంలోకి నాని.. 'ఓజీ-2'కి బ్రేకులు.!

Aug 4, 2026 2:28PM

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత సుజీత్ డైరెక్షన్ లో 'బ్లడీ రోమియో' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు నాని.

అయితే నాని 'ది ప్యారడైజ్' ఆలస్యం కావడంతో.. సుజీత్ తన ఫోకస్ ని పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ 'ఓజీ-2'పైకి షిఫ్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. 'ఓజీ-2' పూర్తయిన తర్వాత 'బ్లడీ రోమియో' ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో నాని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ ఓ క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

'బ్లడీ రోమియో' రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభం కాబోతోందట. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లండన్ లో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఏమాత్రం విరామం ఇవ్వకుండా ఒకే విడతలో ఈ లండన్ షెడ్యూల్ ను డిసెంబర్ కల్లా  కంప్లీట్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

మొత్తానికి ఈ లేటెస్ట్ న్యూస్ ను బట్టి చూస్తే.. 'బ్లడీ రోమియో' పూర్తయిన తర్వాతే 'ఓజీ-2' పట్టాలెక్కే అవకాశముంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. 

 

 

Bloody Romeo, Nani, Sujeeth, OG2, Pawan Kalyan

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com