Home

»

Latest News

Prakash Raj: ప్రకాష్ రాజ్‌ను చంపితే బాధ్యత నాదే.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్!

Apr 22, 2026

సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సనాతన ధర్మం, హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

హిందూ ధర్మంపై దాడిని సహించబోం
కర్మన్ ఘాట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది హిందూ వ్యతిరేకులు నాస్తికులనే ముసుగులో సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీరాముడు, లక్ష్మణుడిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వారిని "ఊరికించి కొడతాం" అంటూ ఆయన హెచ్చరించారు.

'చంపితే బాధ్యత నాదే'.. సంచలన ప్రకటన
ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మరింత ఆవేశంగా మాట్లాడుతూ.. "ప్రకాష్ రాజును ఎవరైనా చంపితే దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను" అంటూ అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి
ప్రకాష్ రాజ్‌ను అన్ని సినిమా పరిశ్రమల నుండి వెంటనే బ్యాన్ చేయాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సినీ అగ్ర హీరోలు, నిర్మాతలు ఈ విషయంలో స్పందించి ఆయనకు అవకాశాలు ఇవ్వకూడదని కోరారు. ప్రకాష్ రాజ్ ఎక్కడ షూటింగ్‌లో పాల్గొన్నా అక్కడికి వచ్చి అడ్డుకుంటామని, ఆయనపై భౌతిక దాడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com