Home

»

Latest News

బ్లాక్ బ్యూటీ తల్లికాబోతుందా..?

Nov 7, 2016 4:03PM

ప్రజంట్ బాలీవుడ్‌లో ప్రెగ్నెంట్ అవుతోన్న భామల లిస్ట్ పెరిగిపోతోంది. సైఫ్ అలీఖాన్ భార్య కరీనా‌‌ కపూర్ మరికొద్ది నెలల్లో ఒక బిడ్డకు జన్మనివ్వబోతుండగా..తాజాగా బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసు కూడా తల్లికాబోతున్నట్లు బి-టౌన్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అలోన్ సినిమా షూటింగ్‌ టైంలో బిపాసా, కరణ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం పెద్దల అంగీకారంతో మే నెలలో ఈ జంట ఒక్కటైంది. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు గత నెల రోజుల నుంచి బిపాసా..భర్త కరణ్‌తో కలిసి ముంబైలో పేరు మోసిన గైనకాలజిస్టులను కలుస్తోందట..దీంతో బిపాసా గర్భవతి అయివుంటుందని హిందీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయం మీడియా చెవిన పడటంతో దీనిపై ఛానెల్స్, వెబ్‌సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయమై బిపాసా, కరణ్‌లను మీడియా ప్రశ్నించగా ఇద్దరూ నోరుమెదపడం లేదు. అయినా విషయం ఎన్నాళ్లని లోపల దాస్తారు..అతి త్వరలోనే బయటకు రాక తప్పదు కదా..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com