వీడియో రిలీజ్ చేసిన నటుడు.. కన్నీళ్లు ఒకటే తక్కువ
on Feb 11, 2026

-వీడియోలో ఏముంది
-ఏం చెప్తున్నాడు
-అభిమానుల నీరాజనాలు
లైట్స్ ఆన్, రోలింగ్ కెమెరా, క్లాప్ ఇన్, యాక్షన్.. ఇవన్నీ ఒక దర్శకుడు చెప్పగానే హీరో తన మంచి పనులు చెయ్యడం ఒక రేంజ్ లో ప్రారంభిస్తాడు. సదరు మంచి పనులని సిల్వర్ స్క్రీన్ పై చూసిన వాళ్ళు హీరోని మెచ్చుకోవడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి. అభిమానులుగా కూడా మారతారు. కానీ ప్రముఖ హీరో, బిగ్ బాస్ ఆరవ సీజన్ రన్నరప్ శ్రీహాన్(Shrihan)ఎవరి డైరెక్షన్ మోడ్ లో కాకుండా ఆఫ్ ది స్క్రీన్ ఒక మంచి పని చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
శ్రీహాన్ సోషల్ మీడియా వేదికగా ఒక రిలీజ్ చేసాడు. సదరు వీడియోలో శ్రీహాన్ నైట్ కారులో వెళ్తుంటే రోడ్ పక్కన ఒక వ్యక్తి అచేతన స్థితిలో పడి ఉన్నాడు. ఫుల్ గా మందు తాగడం వల్లనే అతనికి ఆ పరిస్థితి. దాంతో శ్రీహాన్ కారు ఆపి అతన్ని రోడ్ దాటించాడు. ఆ తర్వాత సదరు వీడియోలో శ్రీహాన్ మాట్లాడుతు అతను ఎవరో.. ఎందుకు మందు తాగాడో మనకి అనవసరం. అతని చేతులు, కాళ్ల పక్క నుంచే కారులు, బైక్స్ వెళ్తున్నాయి. ట్రాఫిక్ ఉన్న టైంలో వెహికల్స్ కి అతను కనపడకపోవచ్చు. దాంతో ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జనం మాత్రం అతన్ని చూస్తున్నారు కానీ ఎవరు హెల్ప్ చెయ్యడం లేదు. రేపు జరగరానిది ఏదైనా జరిగి సోషల్ మీడియాలో చూసి బాధపడే బదులు దయచేసి ఇలాంటి వారిని చూస్తే సేవ్ చెయ్యండని చెప్పుకొచ్చాడు.
Also read: swayambhu: స్వయంభు టీజర్ వచ్చేసింది.. నిఖిల్ కి పాన్ ఇండియా హిట్ ఖాయమా!
నెటిజన్స్ ఈ వీడియోని చూసి మెచ్చుకోవడమే కాకుండా మీరు రియల్ హీరో అని కామెంట్స్ చేస్తున్నారు. మా ఆవారా జిందగీ, వర్జిన్ బాయ్స్ వంటి సినిమాల్లో కూడా శ్రీహాన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



