
ఒకవైపు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) రిలీజ్‌కి రెడీ అవుతోంది. మరోవైపు బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని రేంజ్‌లో సైలెంట్ సునామీలా దూసుకొచ్చింది 'DC' సినిమా. ఇప్పుడు ఈ 'DC' దెబ్బకి సూర్య సినిమాకి స్క్రీన్ల సమస్య ఎదురుకాబోతోందనే న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతూ, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన 'DC' సినిమాపై విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ, థియేటర్లలోకి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్ల రచ్చ మొదలుపెట్టింది. ఇప్పటికే సుమారు రూ. 28 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలనే షాక్‌కి గురిచేసింది. దీంతో ప్రొడక్షన్ హౌస్ 'సన్ పిక్చర్స్'.. సెకండ్ వీకెండ్‌లో కూడా DC కి ఉన్న స్క్రీన్లను అస్సలు తగ్గించకుండా హోల్డ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఆగస్టు 14న సూర్య హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలోకి రాబోతోంది. 'కరుప్పు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య, 'లక్కీ భాస్కర్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ, 'DC'కి పాజిటివ్ టాక్ రావడం, దాని వెనుక 'సన్ పిక్చర్స్' ఉండటంతో.. ఈ సినిమాకి థియేటర్ల సమస్య వచ్చే అవకాశముంది.
ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారనేదే మెయిన్ సస్పెన్స్. ఒకవేళ DC సినిమాకి ఉన్న పాజిటివ్ టాక్ చూసి, ఆగస్టు 15 లాంగ్ వీకెండ్‌లో ఆ సినిమా స్క్రీన్లనే కంటిన్యూ చేస్తే.. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' కి ఊహించిన దానికంటే చాలా తక్కువ థియేటర్లు వచ్చే ప్రమాదం ఉంది.
థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ కోసం చాలా కాలం ఎదురుచూసిన సూర్యకి, ఇటీవల వచ్చిన 'కరుప్పు' సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి, సూర్య బాక్సాఫీస్ స్టామినాని మరోసారి చాటిచెప్పింది.
'కరుప్పు' ఇచ్చిన ఆ ఊపును 'విశ్వనాథ్ అండ్ సన్స్' తో కంటిన్యూ చేయాలని సూర్య భావించారు. కానీ ఇప్పుడు 'DC' రూపంలో ఊహించని సవాలు వచ్చిపడింది.
ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్'కి మొదటి షో నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప.. ఈ స్క్రీన్ల సమస్యను దాటుకుని భారీ ఓపెనింగ్స్ సాధించడం సాధ్యం కాదు. మరి 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ గండాన్ని ఎలా దాటుతుందో చూడాలి.
Suriya, Vishwanath and Sons, Venky Atluri, Lokesh Kanagaraj, DC Movie




