Home

»

Latest News

'పుష్ప' కంటే ఎక్కువ.. 'వకీల్ సాబ్' కంటే తక్కువ

Feb 28, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించిన 'భీమ్లా నాయక్' మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.69.19 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. 108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగిన భీమ్లా నాయక్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 38.81 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ హవా 'పుష్ప కంటే ఎక్కువ, వకీల్ సాబ్ కంటే తక్కువ' అన్నట్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్ల బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ మూడు రోజుల్లో 53.07 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణలో 25.88కోట్లు(35 కోట్ల బిజినెస్), ఆంధ్రప్రదేశ్ లో 27.19కోట్లు(53.75 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల మూడు రోజుల కలెక్షన్స్ లో పుష్ప మూవీని భీమ్లా నాయక్ దాటేసింది. పుష్ప మూడు రోజుల్లో 52.98 కోట్లు రాబట్టగా, భీమ్లా నాయక్ 53.07 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే పవన్ గత చిత్రం వకీల్ సాబ్ ని మాత్రం దాటకపోవడం విశేషం. వకీల్ సాబ్ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 53.37 కోట్లు వసూలు చేసింది.

వకీల్ సాబ్ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 32.24 కోట్లు, రెండో రోజు 10.74 కోట్లు, మూడో రోజు 10.39 కోట్లు షేర్ రాబట్టగా.. భీమ్లా నాయక్ మొదటి రోజు 26.42 కోట్లు, రెండో రోజు 13.14 కోట్లు, మూడో రోజు 13.51 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు వకీల్ సాబ్ కంటే భీమ్లా నాయక్ దాదాపు ఆరు కోట్ల షేర్ తక్కువగా రాబట్టినప్పటికీ.. రెండు, మూడు రోజుల్లో ఎక్కువ కలెక్ట్ చేసి సత్తా చాటింది. పుష్ప విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులు 24.90 కోట్లు, 13.70 కోట్లు, 14.38 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు, మూడు రోజుల్లో భీమ్లా నాయక్ కంటే పుష్ప ఎక్కువ వసూళ్లు రాబట్టినప్పటికీ, ఫస్ట్ డే మాత్రం తక్కువ కలెక్ట్ చేసింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com