Home

»

Latest News

భాగ్యశ్రీ బోర్సే నెక్స్ట్ సినిమాలు ఏంటో తెలుసా?

Jul 17, 2026 2:41PM

 

సినీ క్రిటిక్స్ 'మిస్టర్ బచ్చన్' మూవీ చూసిన దగ్గర్నుంచి 'భాగ్యశ్రీ బోర్సే' తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుందని చెప్తూనే వస్తున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ తో పాటు భాగ్యశ్రీ నుంచి వచ్చిన కింగ్ డమ్, ఆంధ్రాకింగ్ తాలూకా, కాంత చిత్రాలు ఫెయిల్. దీంతో సినీ క్రిటిక్స్ అంచనాలు తప్పుతాయని భావించారు. కానీ ప్రెజెంట్ థియేటర్స్ లో సంచలనం సృష్టిస్తున్న లెనిన్ తో సినీ క్రిటిక్స్ అంచనాలు కరెక్ట్ అని అర్థమయ్యాయి. భారతి క్యారక్టర్ లో భాగ్యశ్రీ  ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ప్రతిఒక్కరు ఫిదా అవుతుండటంతో పాటు సినిమా విజయంలో భాగ్యశ్రీ బోర్సే కూడా భాగమయ్యింది. 

దీంతో ఇప్పుడు అందరు భాగ్యశ్రీ బోర్సే నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అభిమానులైతే భాగ్యశ్రీ కి పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే తెలుగు సినిమా అగ్ర హీరోయిన్ కావడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతానికైతే తన నుంచి ఎలాంటి కొత్త చిత్ర ప్రకటన రాలేదు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన శివకుమార్ మురుగేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రం 'సేయోన్' (Seyon) లో కథానాయికగా చేస్తుంది. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

also read:  ఓ సుకుమారి మూవీ రివ్యూ 

Bhagyashri borse, lenin, akhil

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com