Home

»

Latest News

అదరగొడుతున్న "బుడ్డా" ప్రోమో

Jun 15, 2011 9:22AM

అదరగొడుతున్న "బుడ్డా" ప్రోమో అని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రథాన పాత్రలో నటిస్తుండగా, టబు, రవీనా టాండన్, హేమా మాలిని, ఛార్మి, సోనూ సూద్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తూండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న చిత్రం"బుడ్డా" హోగా తేరా బాప్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ యాంగ్రీ ఓల్డ్ మేన్ గా నటిస్తుండగా, సోను సూద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

 

 

తొలిసారిగా ఛార్మి ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. ఈ "బుడ్డా" హోగా తేరా బాప్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ప్రోమో బాలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తూంది. గతంలో అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మేన్ గా అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాలో చాలా యారగెంట్ పాత్రలో ఆయన నటన ప్రోమోలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూంది. ఇక సినిమాలో ఆయన నటన ఏ రేంజ్ లో ఉంటుందోనని జనం ఎదురుచూస్తున్నారు. "బుడ్డా" హోగా తేరా బాప్ సినిమా జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com