
వెబ్ సిరీస్ : బ్యాచ్ మేట్స్
నటీనటులు : సాయి శ్రీరామ్ వెంపరాల, సింధు రెడ్డి, గీర్వాణి రెడ్డి, ఆంథోని కార్తీక్, బిందు మాధవి తదితరులు
సంగీతం : సాయి దేవా హర్ష
ఛాయాగ్రహణం : సాయి తేజ కళ్ల
ఎడిటింగ్ : రాగం సత్య నితేష్
నిర్మాతలు : సకమూరి నారాయణ స్వామి, నితిన్ సాయి చల్లాగుల్ల
దర్శకుడు : శ్రీ హర్ష శెట్టి
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : జియో హాట్ స్టార్
కథ :
హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సిద్దార్థ్(సాయి శ్రీరామ్ వెంపరాల), సామ్మి(సింధు రెడ్డి), మిల్కీ మహేష్(ఆంథోని కార్తీక్) బీటెక్ లో కొత్తగా జాయిన్ అవుతారు. అక్కడ వారికి అంతా కొత్తగా ఉంటుంది. ఇక అదే కాలేజీలో వారి క్లాస్ లో కొత్తగా గోల్డీ అనే అమ్మాయి వస్తుంది. తను ఆ ముగ్గురి గ్రూప్ తో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. అయితే కాలేజీలో ఉన్న ఒక పెద్ద సర్ కొడుకు ప్రెషర్స్ ని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. అది తెలియని మిల్కీ యాదవ్ నేరుగా అతని దగ్గరికే వెళ్ళి కాస్త ఎక్స్ ట్రాలు చేస్తాడు. ఆ తర్వాత ఆ ముగ్గురి కాలేజీ లైఫ్ ఎలా మారిపోయిందనేది మిగతా కథ.
విష్లేషణ:
నాలుగు ఎపిసోడ్ లతో ఈ సిరీస్ మొదలైంది. అయితే ఒక్కో ఎపిసోడ్ నిడివి ఇరవై నిమిషాలు మాత్రమే. ఈ సిరీస్ కథ చాలా సింపుల్. ముగ్గురు స్నేహితులు ఇంటర్ కాలేజీ పూర్తి చేసుకొని బీటెక్‌లో జాయిన్ కావడం.. అక్కడ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది పాయింట్. ఇది చాలా రొటీన్ అయినప్పటికి, యూత్‌ను ఎంగేజ్ చేయగల ఒక్క స్పార్క్ తగిలితే ఇలాంటి కథలకు మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ ఇందులో అలాంటిది ఏమీ లేదు.
ఇక ఈ వెబ్ సిరీస్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య ఉండే స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్, వారి మధ్య సాగే సీన్స్ ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కావు. ఈ సిరీస్ మొత్తంలో మిల్కీ మహేష్ పాత్ర చేసే కామెడీ కాస్త ఊరట. మిగతాదంతా డొల్ల. స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది.
ఈ వెబ్ సిరీస్‌లో నటించిన వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి స్ట్రాంగ్ డైలాగ్స్ , స్ట్రాంగ్ క్యారెక్టర్ డిజైన్ చేయాలి కానీ ఏదో మాములు సైడ్ యాక్టర్స్ ఎలాగో అలాగే వారి నటన ఉంటుంది. అందుకే ప్రేక్షకులకు కనెక్ట్ కాలేరు. మెయిన్ లీడ్ డబ్బింగ్, లిప్ సింకింగ్ కుదరలేదు. స్లో సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి ప్రేక్షకులను ఇర్రిటేట్ చేస్తుంది. సీనియర్స్-జూనియర్స్ మధ్య వచ్చే క్లాష్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. ఇక హీరో అండ్ గ్యాంగ్‌కు సీనియర్స్ ఇచ్చే టాస్క్ దానిని పూర్తి చేసే క్రమం కూడా ఆకట్టుకోదు. కాలేజీ సీన్స్ కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయ్యాయి. ఫ్లాట్ కథను ఎంచుకోవడంతో ఆయన దానిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. కథలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోవడంతో ఈ సిరీస్ చాలా రొటీన్‌గా సాగుతుంది. ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా :
బ్యాచ్‌మేట్స్ ఒక బోరింగ్ కాలేజీ లైఫ్. జస్ట్ ఒకే.
రేటింగ్ : 1.5 /5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.






