Home

»

Latest News

తెలంగాణ‌లో 'బంగార్రాజు' రిక‌వ‌రీ క‌ష్ట‌మే!

Jan 27, 2022

 

నాగార్జున‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన 'బంగార్రాజు' సినిమా ఒక్క తెలంగాణ‌ ఏరియాలో మిన‌హాయిస్తే, మిగ‌తా అన్నిచోట్లా లాభాల‌ను అందుకుంటోంది. క‌ల్యాణ్‌కృష్ణ కుర‌సాల డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిప‌బ్లిక్ డే హాలిడేని స‌ద్వినియోగం చేసుకుంటూ రూ. 50 ల‌క్ష‌ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ స‌మ‌కూర్చిన 'బంగార్రాజు' 13 రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌సూలు చేసిన షేర్ రూ. 33.52 కోట్ల‌కు చేరుకుంది.

Also read: వివాదంలో చిక్కుకున్న 'మెగా కోడలు'

13వ రోజు ఈ సినిమా తెలంగాణ‌లో రూ 9 ల‌క్ష‌లు, ఆంధ్రాలో రూ. 32 ల‌క్ష‌లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 10 ల‌క్ష‌ల షేర్ వ‌సూలు చేసింది. దీంతో తెలంగాణ‌లో 'బంగార్రాజు' షేర్ రూ. 8.10 కోట్ల‌ను వ‌సూలు చేసిన‌ట్ల‌యింది. ఈ ఏరియాలో దీని ప్రిరిలీజ్ బిజినెస్ వాల్యూ రూ. 11 కోట్లు. అంటే ఇంకా రూ. 2.90 కోట్లు రావాలి. తెలంగాణ‌లో ఈ సినిమా ప్ర‌స్తుత ట్రెండ్ చూస్తుంటే రూ. 2.50 కోట్ల వ‌ర‌కు డెఫిసిట్ రావ‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇది పెద్ద లాస్ కిందే లెక్క‌.

Also read: రూ. 150 కోట్లు ఖ‌ర్చుపెట్టి 'బాహుబ‌లి'ని చెత్త‌బుట్ట‌లో ప‌డేశారు!

ఆంధ్రా, రాయ‌ల‌సీమ బ‌య్య‌ర్లు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. రాయ‌ల‌సీమ‌లో రూ. 6 కోట్ల‌కు సినిమాను కొన్న బ‌య్య‌ర్లకు ఇప్ప‌టికే రూ. 6.53 కోట్ల షేర్ వ‌చ్చింది. అంటే ప్రాఫిట్‌లోకి వ‌చ్చేశారు. ఆంధ్రాలో 13 రోజుల‌కు క‌లెక్ట‌యింది రూ. 18.90 కోట్ల షేర్‌. అక్క‌డ 'బంగార్రాజు' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 16.80 కోట్లు. అంటే ఇప్ప‌టికే అక్క‌డి బ‌య్య‌ర్లు రూ. 2 కోట్ల లాభాల‌ను అందుకున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com