
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగడానికి ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తన కుమార్తె పెళ్లి పత్రికను సినీ పరిశ్రమలోని ప్రముఖులకు అందిస్తూ వివాహానికి ఆహ్వానించే పనుల్లో బిజీగా మారిపోయారు.
అందులో భాగంగానే తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సతీమణి సురేఖను కలిసి తమ ఇంటి వేడుకకు రావాల్సిందిగా ఘనంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వాన వేడుకలో బండ్ల గణేష్‌తో పాటు ఆయన సతీమణి, ఇద్దరు కుమారులు కూడా పాల్గొన్నారు.
ఆగస్టు 16న జనని బండ్ల వివాహం సూర్యతో వైభవంగా జరగనుంది. ఈ శుభకార్యానికి తప్పకుండా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని మెగా దంపతులను బండ్ల గణేష్ కోరారు. చిరంజీవి సైతం ఎంతో ఆప్యాయంగా బండ్ల గణేష్ కుటుంబ సభ్యులను పలకరించి, పెళ్లి పత్రికను స్వీకరిస్తూ పెళ్లి కుమార్తెకు, కుటుంబానికి తన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ప్రత్యేక భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని బండ్ల గణేష్ ఆయనను ఆత్మీయంగా కౌగిలించుకుని ఉన్న ఫోటో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. మరొక ఫోటోలో బండ్ల గణేష్ కుటుంబ సభ్యులంతా మెగాస్టార్ దంపతులతో కలిసి గ్రూప్ ఫోటోకు పోజ్ ఇచ్చారు.
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో #JananiSuryaPayanam అనే హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ అవుతోంది. ఆగస్టు 16న జరగబోయే ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Megastar Chiranjeevi, Bandla Ganesh, Janani Bandla, Wedding






