Home

»

Latest News

ఆర్.బి.చౌదరిగారి మృతి న‌న్ను తీవ్రంగా క‌ల‌చివేసింది : బండ్ల గ‌ణేశ్‌

May 05, 2026

ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఆర్.బి. చౌదరి మరణం పట్ల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.

ఆర్.బి. చౌదరి గారి మృతి వార్త న‌న్ను తీవ్రంగా కలచివేసింది.  తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన నిర్మించిన అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చౌదరి గారి సినిమాల ద్వారా వచ్చిన మంచి సందేశాలు, మధురమైన పాటలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు బండ్ల గ‌ణేశ్‌. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com