Home

»

Latest News

బాల‌య్య‌, త‌మ‌న్.. వ‌రుస‌గా మూడోసారి!

Dec 7, 2021 11:45AM

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం `అఖండ‌` థియేట‌ర్స్ లో ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `మండే టెస్ట్`లోనూ డిస్టింక్ష‌న్ లో పాసైన ఈ డివోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్.. బాల‌య్య కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ కాబోతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.

ఇదిలా ఉంటే.. `అఖండ‌` ఘ‌న‌విజ‌యంలో సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఇదివ‌ర‌కు బాల‌య్య‌తో చేసిన‌ `డిక్టేట‌ర్` (2016) ఆశించిన ఫ‌లితం అందుకోక‌పోయినా.. `అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ ముచ్చ‌ట తీర్చుకున్నాడు త‌మ‌న్. కాగా,  త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న బాల‌య్య - `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ మూవీకి కూడా త‌మ‌న్ నే స్వ‌ర‌క‌ర్త‌. అంతేకాదు.. వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో బాల‌య్య చేయ‌బోతున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ కి కూడా త‌మ‌న్ పేరునే ప‌రిశీలిస్తున్నార‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. బాల‌య్య మూడు వ‌రుస చిత్రాల‌కు బాణీలు అందించే ఛాన్స్ త‌మ‌న్ కి ద‌క్కిన‌ట్టే.

గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మకి త‌ప్ప మ‌రే సంగీత ద‌ర్శ‌కుడికి బాల‌య్య‌తో మూడు వ‌రుస చిత్రాల‌కు ప‌నిచేసే అవ‌కాశం ద‌క్క‌లేదు. సో.. గురువు మ‌ణిశ‌ర్మ బాట‌లోనే శిష్యుడు త‌మ‌న్ కూడా బాల‌య్య కాంబోలో వ‌రుస చిత్రాలు చేయ‌బోతుండ‌డం విశేషం. త్వ‌ర‌లోనే బాల‌య్య - అనిల్ రావిపూడి కాంబో మూవీలో త‌మ‌న్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com