బాలయ్య పక్కన ఇలియానా..అసలు ఛాన్స్ ఉందా..?
on Apr 20, 2016
బాలయ్య వందో సినిమా గురించి ఏ పుకారు వచ్చినా చాలా ఆసక్తిగా ఉంటోంది. ల్యాండ్ మార్క్ మూవీ కోసం ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు బాలయ్య. గౌతమీ పుత్ర శాతకర్ణి కాబట్టి, శాతకర్ణి తల్లి పాత్ర చాలా ముఖ్యం. ఆ పాత్రకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ల్ హేమమాలిని ఆల్ మోస్ట్ కన్ఫామ్ అంటున్నారు. ఇక హీరోయిన్ రోల్ ఎవరికిస్తారన్నదాని మీదే కన్ఫ్యూజన్ నడుస్తోంది. చాలా వార్తలు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి. ఇప్పుడున్న టాక్ ప్రకారమైతే బాలయ్య సరసన హీరోయిన్ గా ఇలియానా పేరు తెరపైకి వచ్చింది. కానీ అసలింతకీ వీళ్లిద్దరి కాంబినేషన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందన్నది ఆలోచించాల్సిన విషయం. బాలకృష్ణకు కలిసొచ్చిన నయనతార అయినా, లేక ఇప్పటికే రెండు సార్లు యువరాణి గెటప్స్ వేసిన కాజల్ అయినా ఆయన పక్కన బాగానే సెట్ అయిపోతారు. కానీ నడుము భామ ఇలియానా మాత్రం, ఎంత ఆలోచించినా బాలయ్యకు జోడీ అనిపించదు. దీంతో ఇప్పుడు నందమూరి అభిమానులందరిలోనూ, హీరోయిన్ ఎవరు అన్నదానిపైనే చర్చ జరుగుతోంది. అన్ని సస్పెన్స్ లు ఏప్రిల్ 22న షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు విడిపోతాయి. అప్పటి వరకూ నందమూరి అభిమానులకు వెయింటింగ్ తప్పదు మరి.