Home

»

Latest News

Balakrishna: బాలయ్య మనసు బంగారం.. నిర్మాత కోసం కోట్లు వదులుకున్న రియల్ హీరో!

Apr 27, 2026

- టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా బాలకృష్ణ నిర్ణయం
- నిర్మాతల హీరో అనిపించుకుంటున్న నందమూరి హీరో
- బాలయ్య బాటలో మిగతా స్టార్స్ పయనిస్తారా?

గతేడాది 'డాకు మహారాజ్', 'అఖండ-2' సినిమాలతో అలరించిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొందరు స్టార్ హీరోలు జయాపజయాలతో సంబంధం లేకుండా తమ రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ వెళ్తూ, నిర్మాతలకు భారమవుతుంటారు. అయితే కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ మాత్రం.. అందుకు భిన్నంగా తన రెమ్యునరేషన్ ను తగ్గించినట్లు తెలుస్తోంది.

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో 'NBK 111' తెరకెక్కుతోంది. అయితే, సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావించిన బాలయ్య, తన పారితోషికం విషయంలో ఒక అడుగు వెనక్కి వేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం బాలయ్య తన రెమ్యునరేషన్‌లో 10 కోట్ల వరకు తగ్గించుకున్నారని వార్తలు వస్తున్నాయి. 

తన గత చిత్రం 'అఖండ-2'కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న బాలకృష్ణ.. ఈ సినిమాకు రూ.30 కోట్లు మాత్రమే తీసుకోబోతున్నారట. నిర్మాతల శ్రేయస్సు కోరి బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో ఆదర్శంగా నిలుస్తోంది.

'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. మొదట నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేయగా, ఇటీవల కాజల్ అగర్వాల్ పేరు తెరపైకి వచ్చింది. నయనతారతో పోలిస్తే కాజల్ రెమ్యునరేషన్‌ తక్కువని.. రెమ్యునరేషన్‌ పేరుతో అధిక డబ్బు వృథా చేసే కంటే, దానిని సినిమా మేకింగ్ మీద ఖర్చు పెడితే క్వాలిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. 

సినిమా బడ్జెట్ లో సగానికి పైగా రెమ్యునరేషన్లకే పోతున్న ఈ రోజుల్లో..  'NBK 111' టీమ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అభినందనీయమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com