Home

»

Latest News

బాల‌య్య‌తో మిల్కీ బ్యూటీ?

Dec 3, 2021 1:16PM

ఒక‌వైపు యంగ్ స్టార్స్ తో న‌టిస్తూనే.. మ‌రోవైపు సీనియ‌ర్ స్టార్స్ తోనూ జోడీ క‌డుతోంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవితో `సైరా.. న‌ర‌సింహారెడ్డి`లోనూ, విక్ట‌రీ వెంక‌టేశ్ కి జోడీగా `ఎఫ్ 2`లోనూ క‌నువిందు చేసిన త‌మ‌న్నా.. ఆ ఇద్ద‌రితోనూ ఇప్పుడు మ‌రోసారి రొమాన్స్ చేస్తోంది. మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `భోళా శంక‌ర్`లో చిరుతో సెకండ్ టైమ్ జ‌ట్టుక‌ట్టిన ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా త‌యార‌వుతున్న `ఎఫ్ 3`లో వెంకీతో రెండో సారి జ‌త‌క‌ట్టింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో సీనియ‌ర్ హీరోతో రొమాన్స్ చేసేందుకు ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌ముండ‌గా.. వారిలో ఒక‌రిగా త‌మ‌న్నాని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడట‌ అనిల్. ఇప్ప‌టికే `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` (ప్ర‌త్యేక గీతం) కోసం అనిల్ డైరెక్ష‌న్ లో చేసిన త‌మ‌న్నా.. ప్ర‌స్తుతం `ఎఫ్ 3` కోసం మూడోసారి జ‌ట్టుక‌ట్టింది. ఈ అనుబంధంతోనే.. బాల‌య్య మూవీలోనూ న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట మిల్కీ బ్యూటీ. మ‌రి.. బాల‌య్య‌, త‌మ‌న్నా జోడీ వెండితెర‌పై ఏ స్థాయిలో మెస్మ‌రైజ్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com