Home

»

Latest News

'దాదా' ఈజ్ బ్యాక్: గాయాన్ని సైతం లెక్కచేయని బాలయ్య డెడికేషన్!

Oct 6, 2026 11:24AM

 

-గాయమైతే ఏంటి? డోంట్ కేర్ అంటున్న బాలయ్య 
-కీలక షెడ్యూల్ స్టార్ట్ 
-జై బాలయ్య అంటున్న ఫ్యాన్స్ 


గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ' ఈ సారి 'దాదా' తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడం ఖాయమనే నమ్మకం అభిమానులు, మూవీ లవర్స్ లో ఒక రేంజ్ లోనే ఉంది. ఇటీవల సెట్స్‌లో జరిగిన  అనుకోని ప్రమాదంలో బాలకృష్ణకి గాయమైన విషయం తెలిసిందే. సర్జరీ కూడా అవ్వడంతో వైద్యులు రెస్ట్ తీసుకోమని సూచించారు. కానీ నిర్మాతల శ్రేయస్సు కోరే బాలయ్య షార్ట్ పీరియడ్ లోనే షూట్ కి సిద్ధమయ్యారు.

 ఈ క్రమంలోనే 'దాదా' తాజా షెడ్యూల్ కర్ణాటకలోని మైసూర్ లో స్టార్ట్ అయ్యింది. ఈ కీలక షెడ్యూల్‌లో ఉత్కంఠభరితంగా సాగే మాస్ యాక్షన్ సీక్వెన్సెని చిత్రీకరించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని పక్కా ప్లాన్‌ సిద్ధం చేశారు.   ఈ మైసూర్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిన వెంటనే చిత్ర యూనిట్ నేరుగా 'ఏపి' కి షిఫ్ట్ కానుంది.  కాకినాడలో గాయం వల్ల నిలిచిపోయిన షూటింగ్ కూడా వెంటనే కంప్లీట్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: విజయ్ సేతుపతి 'బత్తా' తెలుగులోకి.. అట్లీ ఇచ్చిన క్రేజీ అప్‌డేట్!

 


ఇక్కడ అసలు సెన్సేషనల్ విషయం ఏంటంటే, బాలయ్యకి  గాయమై షూటింగ్ కొన్ని రోజులు పోస్ట్ ఫోన్ అయినప్పటికీ, రిలీజ్ డేట్  విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. యాజ్ ఇట్ ఈజ్ గా డిసెంబర్ 24న వరల్డ్ వైడ్ గా దాదా ల్యాండ్ కానున్నాడు. పెద్ది నిర్మాత 'వెంకట సతీష్ కిలారు' ఎంటైర్  బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించే పనిలో నిమగమై ఉన్నాడు.  ఎప్పటిలాగానే బాలయ్య ఆస్థాన మ్యూజిషియన్  థమన్ గత చిత్రాల కంటే గొప్ప ఆల్బమ్ ఇవ్వాలనే పట్టుదలతో ఉండటంతో పాటు ఈ సారి బిజిఎం ఒక రేంజ్ లో ఉండనుంది.బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది.

 

[Balakrishna Dada Movie Mysore Shooting Schedule Update, Nandamuri Balakrishna, Dada Movie Updates, Gopichand Malineni, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com